హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానశేఖర్‌ ద్వారక, వర్గో పిక్చర్స్‌ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా సినిమాపై కూడా అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలకృష్ణగారి స్పీచ్‌ హైలైట్‌గా నిల‌వ‌డంతో పాటు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలైపోయాయి. ప్రశాంత్‌ ఆర్‌ విహరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు మేక‌ర్స్‌. ‘కచడ కచడ హో గయా…. అర్థమైత లేదయా, అచట ముచట లేదయా…’ అంటూ మొదలైయ్యే ఈ పాట ‘‘ఇక లైట్‌ లేలోరే! మాస్‌ స్టెప్పు వేయ్‌ రే..నేను ఆడాలన్నా..పాడాలన్నా జిందగీలో లేదే సెహరి…చిల్‌ అవ్వాలన్నా లవ్వాలన్నా జిందగీలో లేదే సెహరి..సెహ‌రి’’ అంటూ సాగుతుంది. సోమవారం విడుదలైన ఈ క్యాచీ సాంగ్‌ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌లో హర్ష్‌ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అదిరిపోయాయి. ఈ పాటకు యశ్‌ మాస్టర్‌ కొరియో గ్రఫీ చేశారు. హిట్‌ ఫిల్మ్‌ ‘జాతిరత్నాలు’ సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే..’ అనే సాంగ్‌ పాడిన ‘చౌరస్తా బ్యాండ్‌’ ఫేమ్‌ రామ్‌ మిరియాల ‘‘జిందగీలో లేదే సెహరి..సెహరి’ పాటను పాడారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్‌ అందించారు.

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తుండటం విశేషం.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus