Harsha Sai Call Recording: హాట్ టాపిక్ అవుతున్న హర్షసాయి కాల్ రికార్డ్స్.. అసలేమైదంటే?
- September 25, 2024 / 06:19 PM ISTByFilmy Focus
పాపులర్ యూట్యూబర్స్ లో ఒకరైన హర్షసాయి (Harsha Sai) తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సహాయం చేయడం ద్వారా చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచారు. అయితే ఒక యువతి హర్షసాయి తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతోంది. మరోవైపు హర్షసాయి కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కాల్ రికార్డ్స్ విన్న నెటిజన్లు హర్షసాయి తప్పేం లేదని చెబుతున్నారు.
Harsha Sai Call Recording

బాధితురాలు అని చెబుతున్న యువతి హర్షసాయితో మాట్లాడిన మాటలు ఎన్నో సందేహాలకు తావిచ్చేలా ఉండటం గమనార్హం. హర్షసాయి పరారీలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో సైతం ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది. ఈ కేసు నుంచి హర్షసాయి సులువుగానే బయటపడతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న ఆడియో కాల్స్ గురించి హర్షసాయి సైతం త్వరలో డైరెక్ట్ గా స్పందించే ఛాన్స్ ఉంది.

హర్షసాయి లాయర్ మాట్లాడుతూ డబ్బు కోసమే యువతి ఫేక్ ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు. బాధితురాలి ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని కామెంట్లు చేస్తున్నారు. హర్షసాయికి సోషల్ మీడియాలో అతని అభిమానుల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం. పోలీసుల దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. హర్షసాయి హీరోగా నటిస్తున్న సినిమా మాత్రం ఆగిపోయినట్టేనని తెలుస్తోంది.

ఆ సినిమా వల్లే వివాదం మొదలైన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే బాధితురాలు ఈ ఆడియో కాల్స్ గురించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. హర్షసాయి ఈ కేసు నుంచి ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది. హర్షసాయి మీడియా ముందుకు వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. హర్షసాయి వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
యుట్యూబర్ హర్ష సాయి మహిళ మధ్య జరిగిన పోన్ సంభాషణ#HarshaSai pic.twitter.com/nVEDeGpRob
— TV5 News (@tv5newsnow) September 25, 2024
దేవర మూవీ బడ్జెట్ గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?













