Koratala Siva: ‘ఆచార్య’ ఫలితం.. చిరుతో బాండింగ్ పై ఓపెన్ అయిపోయిన కొరటాల..!
- September 24, 2024 / 03:00 PM ISTByFilmy Focus
4 బ్లాక్ బస్టర్ల తర్వాత దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) చేసిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అటు హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లోనూ.. ఇటు దర్శకుడు కొరటాల శివ కెరీర్లోనూ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ‘ఆచార్య’. ఈ సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. చిరు- కొరటాల శివ మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. పలు సందర్భాల్లో వీళ్ళు చేసిన కామెంట్లు కూడా అలానే ఉన్నాయి.
Koratala Siva

‘హీరో షూటింగ్ కి వస్తున్నాడు అంటే.. డైలాగ్ పేపర్ తో దర్శకుడు రెడీగా ఉండాలి. ఒక 30 నిమిషాలు అయినా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాకే.. షాక్ కి వెళితే సీన్ బాగా వస్తుంది. కానీ దర్శకుడు అప్పటికప్పుడు డైలాగ్స్ రాసుకుని.. హీరోకి ఇచ్చి.. షాట్ కోసం రెడీ అవ్వమంటే అది సరైన పద్ధతి కాదు. దర్శకులు ఇది గమనించాలి’ అంటూ చిరు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇది కచ్చితంగా కొరటాలని ఉద్దేశించే చిరు చెప్పి ఉండొచ్చు అని అంతా అభిప్రాయపడ్డారు.

ఇక ‘దేవర’ (Devara) ప్రమోషన్స్ లో దర్శకుడు కొరటాల శివ కూడా ‘ఎవడి పని వాడు చేసుకుంటే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. వాడు పనిలో వేలుపెట్టి.. వీడి పనిలో వేలుపెట్టి.. ఎందుకు నీ పని నువ్వు చేసుకోకుండా?’ అంటూ కామెంట్లు చేయడంతో.. చిరు పై కొరటాల రివెంజ్ తీర్చుకున్నాడు’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరోపక్క మెగా అభిమానులు అయితే కొరటాలని తీవ్రంగా విమర్శించారు.

ఇక వీటిపై కొరటాల స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘ ‘ఆచార్య’ ఫలితం తర్వాత కూడా చిరంజీవిగారితో నా బాండింగ్ ఎప్పటిలానే స్ట్రాంగ్ గా ఉంది. ‘నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతావ్ శివ’ అని ఫస్ట్ నాకు చెప్పింది చిరంజీవిగారే’ అంటూ క్లారిటీ ఇచ్చాడు కొరటాల.
చిరంజీవి గారితో నా అనుబంధం ఎప్పడూ బానే ఉంటుంది. ఆచార్య రిలీజ్ తర్వాత “you will bounce back stronger shiva” అని నాకు మెసేజ్ చేసిన మొదటి వ్యక్తి #Chiranjeevi గారే.
– #KoratalaSiva during Media Interaction about #Devara pic.twitter.com/56DROzWSWt
— Filmy Focus (@FilmyFocus) September 24, 2024
















