Harsha Sai: నిజంగానే రెండు కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో తీసుకున్నాడా?
- September 24, 2024 / 11:21 PM ISTByFilmy Focus
హాలీవుడ్ లో బీస్ట్ అనే ఒక యూట్యూబర్ ను స్ఫూర్తిగా తీసుకొని అదే తరహా కంటెంట్ తో తెలుగులో పాపులర్ అయిన యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) . అవసరార్థులకు డబ్బులు పంచుతూ, చాలామందికి అకస్మాత్తుగా ఆర్థిక సహాయం చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. నిన్న అతడిపై మిత్రా షా అనే హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ పోలీస్ కేస్ వేసింది. దాంతో ఒక్కసారిగా చిన్నపాటి కల్లోలం మొదలైంది. నిజానికి మిత్ర షా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హర్ష సాయి హీరోగా “మెగా” అనే సినిమా మొదలుపెట్టి, టీజర్ కూడా విడుదల చేసింది.
Harsha Sai

ఆ తర్వాత సినిమా ఏమైంది అనే విషయంలో క్లారిటీ లేదనుకోండి. అయితే.. ఈ కేస్ విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కేస్ వేసిన మిత్రా షా మీద ఇదివరకు కూడా ఈ తరహా అభియోగాలున్నాయి. అందుకే హర్ష సాయి ధైర్యంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా “డబ్బుల కోసం వేసిన కేస్ అది, మా లాయర్ చూసుకుంటాడు” అని స్టోరీ పెట్టాడు.

రీసెంట్ గా జానీ మాస్టర్ (Jani Master) కేస్ ఉదంతం అమ్మాయికి ఫేవర్ గా ఉండడంతో.. ఈ కేస్ కూడా అదే తరహాలో తనకు లాభిస్తుందనే భావనతోనే మిత్రా షా కేస్ పెట్టిందని హర్ష సాయి & టీమ్ చెబుతున్నారు. ఇకపోతే.. ఒక యాప్ లేదా యాడ్ ఎండార్స్మెంట్ కోసం దాదాపు కోటి రూపాయలు తీసుకునే హర్ష సాయి కేవలం రెండు కోట్ల కోసం ఏకంగా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడంటేనే కాస్త అనుమానంగా ఉంది.

మరి ఈ విషయంలో నిజ నిర్ధారణ త్వరగా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే లేటయ్యేకొద్దీ రకరకాల కథనాలు పుట్టుకొచ్చి అసలు కేస్ ను సైడ్ లైన్ చేస్తాయి. మరి హర్ష సాయి (Harsha Sai) & టీమ్ ఈ విషయమై ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.














