Karthi Apologizes: తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!
- September 24, 2024 / 02:24 PM ISTByFilmy Focus
నిన్న సాయంత్రం కార్తీ (Karthi) కొత్త సినిమా “సత్యం సుందరం”’ (Sathyam Sundaram) ప్రీరిలీజ్ ఈవెంట్లో తిరుపతి లడ్డూను ఉద్దేశించి “లడ్డూ చాలా సెన్సిటివ్ ఇష్యూ” అని కార్తీ చేసిన కామెంట్ పై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇవాళ ఉదయం కోపంగా రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే. దాంతో తమిళ సినిమా అభిమానులందరూ పవన్ కళ్యాణ్ ను తిట్టిపోయడం మొదలెట్టారు. కట్ చేస్తే.. కార్తీ స్వయంగా పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ సాక్షిగా సారీ చెప్పాడు.
Karthi Apologizes

తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడినని, పొరపాటున తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని కార్తీ వేసిన ట్వీట్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఎందుకంటే.. కార్తీకి తమిళంలో కంటే తెలుగులో ఎక్కువమంది అభిమానులున్నారు. కార్తీని హీరోగా కంటే వ్యక్తిగా ఎక్కువ ఇష్టపడతారు. అయినా నిన్న జరిగిన విషయంలో కార్తీ కంటే యాంకర్ మంజూష తప్పు ఎక్కువగా ఉందని, ఆమె లడ్డూ టాపిక్ తీసుకురాకపోతే ఈ ఇష్యూ అయ్యేది కాదని అందరూ భావించారు.

ఇప్పుడు కార్తీ క్షమాపణలు కోరడంతో ఈ ఇష్యూకి తెరపడినట్లే. ఇకపోతే.. ఈ ఇష్యూ పుణ్యమా అని “సత్యం సుందరం” సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఎందుకంటే ఆ సినిమా గురించి ఈ లడ్డూ ఇష్యూ అయ్యేవరకు సగం మంది తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలియదు.

ఆఖరికి నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా మీడియాకి తప్ప జరుగుతున్నట్లుగా ఎవరికీ తెలియదు. అలాంటిది ఉదయం నుంచి సోషల్ మీడియాలో “సత్యం సుందరం” అనే సినిమా పేరు మార్మోగిపోయింది. మరి ఈ వివాదం పుణ్యమా అని “సత్యం సుందరం” సినిమా ఓపెనింగ్స్ & కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయేమో చూడాలి.

















