స్టార్ డమ్ అనేది పెద్ద మాయ. ఆ స్టార్ డమ్ ను ఆస్వాదించాలి కానీ తలకి ఎక్కించుకోకూడదు. అలా తలకి ఎక్కించుకున్నవాళ్లందరూ ఇప్పుడు కనిపించకుండాపోయారు. విజయం వరించిన తర్వాత ఆ విజయానికి కారణం ఎవరు అనేది పబ్లిక్ గా చెప్పుకోవడం అనేది ఈమధ్య జరగడం లేదు. సినిమాకి కొన్ని వందల మంది టెక్నీషియన్లు పని చేస్తారు. కానీ చివర్లో హీరో క్రెడిట్ మొత్తం దోచేసుకుంటాడు. ఇది దాదాపు ప్రతి కమర్షియల్ సినిమాకి జరిగే విషయమే.
దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) , రాఘవేంద్రరావు (Raghavendra Rao) , విశ్వనాథ్ (Vishwanath) వంటి సీనియర్ దర్శకుల తర్వాత రాజమౌళి ఒక్కడే దర్శకుడిగా తనకు రావాల్సిన క్రెడిట్ ఒకరు ఇచ్చే పని లేకుండా తానే దక్కించుకున్నాడు. అయితే.. ఒక హీరో ఒక దర్శకుడికి తన కెరీర్ మొత్తానికి క్రెడిట్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా అరుదుగా జరిగే విషయం. “పుష్ప” (Pushpa 2: The Rule) రిలీజైన తర్వాత సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని బన్నీ (Allu Arjun) స్టేజ్ మీద చెప్పడాన్ని అందరూ మెచ్చుకున్నారు.
అయితే.. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా బన్నీ స్పెషల్ గా సుకుమార్ ను (Sukumar) పొగడడమే కాక సుకుమార్ లేకపోతే నేను లేను అని చెప్పడం అనేది ఒక స్నేహితుడిగా సుకుమార్ కి బన్నీ ఎంత విలువ ఇస్తాడు అని అర్థమవుతుంది. అయితే.. నిన్నటి ఈవెంట్లో స్పెషల్ ఏమిటంటే.. నిజానికి బన్నీ ఆ స్టేజ్ మీద అలా చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ.. తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికి క్రెడిట్స్ ఇచ్చి తాను ఎలాంటి వాడిననేది చెప్పకనే చెప్పాడు. నిన్న ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కు టికెట్ హైక్స్ విషయంలో ధన్యవాదాలు తెలిపి మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న చిన్నపాటి చీలికను కూడా కవర్ చేసి.. సినిమా రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాడు. దాంతో.. మొన్నటివరకు అల్లు అర్జున్ ను తిట్టినవాళ్లు కూడా హ్యాట్సాఫ్ అంటున్నారు.
సుకుమార్ లేకపోతే నేను లేను..
సుకుమార్ నాతో ఆర్య తీయకపోతే నేను లేను..#AlluArjun #Sukumar #Pushpa2TheRule pic.twitter.com/6VSTJuotZv
— Filmy Focus (@FilmyFocus) December 2, 2024