Pushpa 2: బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన సుకుమార్!

  • December 3, 2024 / 01:05 PM IST

“పుష్ప2” (Pushpa 2: The Rule)  బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. దేవి  (Devi Sri Prasad)   సరైన అవుట్ పుట్ ఇవ్వక తమన్ (S.S.Thaman) , అజనీష్ లోక్నాథ్ (B. Ajaneesh Loknath), సామ్ సి.ఎస్  (Sam C. S.) రంగంలోకి దిగారని వార్తలు రాగా, అనంతరం దేవి మళ్లీ కంట్రోల్ తన చేతిలోకి తీసుకున్నాడని, ముఖ్యంగా చెన్నై ఈవెంట్లో దేవి బరస్ట్ అయిన అనంతరం నిర్మాతలు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక దేవికి మళ్లీ ఓ ఛాన్స్ ఇచ్చారు. అయితే.. దేవి ఇచ్చినదానికంటే తక్కువ టైంలో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చాడట దేవి.

Pushpa 2

దాంతో తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను పక్కపెట్టారట దర్శకనిర్మాతలు. అందుకే తమన్ కూడా సైలెంట్ అయిపోయాడు. అయితే.. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సుకుమార్  (Sukumar) మాట్లాడుతూ.. “దేవి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్ కి ఇరగ్గొట్టాడు” అని పేర్కొనడంతో అసలు పుష్ప2 కి ఎవరు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు అనే విషయంలో కన్ఫ్యూజన్ తొలిగిపోయింది.

దాంతో దేవి కూడా చల్లబడి.. మనకు సొంతమైంది మాత్రమే అడిగి తీసుకోవాలి అని తాను చెన్నైలో జరిగిన ఈవెంట్లో కోపంతో ఇచ్చిన స్టేట్మెంట్ కి కవరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్లో. దాంతో.. పుష్ప2 బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీప్రసాద్ తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని తెలుస్తోంది. రేపు సాయంత్రం నుండి మొదలవ్వనున్న ప్రీమియర్స్ తో దేవి ఏ రేంజ్ లో న్యాయం చేశాడు అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది అనుకోండి.

అయితే.. ఒక సంగీత దర్శకుడిగా “పుష్ప2” అనే సినిమా దేవిశ్రీప్రసాద్ కెరీర్ కు చాలా కీలకం. పాటలన్నీ ఎలాగూ హిట్ అయిపోయాయి. రిలీజ్ తర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందంటే.. దేవి కెరీర్ కు ఇంకొన్నాళ్లు ఢోకా ఉండదు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus