‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ టీజర్ లో ఈ 7 పాయింట్స్ గమనించారా?

యస్ యాస్ రాజమౌళి నుంచి ట్రిబుల్ ఆర్ సంబంధించిన టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు ఫ్యాన్స్ అందరూ. అంతేకాదు, ముఖ్యంగా అల్లూరిసీతారామరాజు టీజర్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ని కొమురంభీమ్ గా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరిపోయారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు రాజమౌళి రిలీజ్ చేసిన రామరాజు ఫర్ భీమ్ టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది.

ముందుగా ఈటీజర్ లో మనం కొన్ని అంశాలని నోటీస్ చేసినట్లయితే..,

0.08 సెకన్స్ దగ్గర నల్లమల ఫారెస్ట్ ని చాలా అందంగా చూపించాడు రాజమౌళి. తర్వాత ఒక మొరటు మనిషిగా.. బలిష్టమైన శరీరసౌష్టవంతో ఎన్టీఆర్ ఇంట్రో అదిరింది. కండబలం.. కాళ్లల్లో ఉన్న పిక్కబలం హైలెట్ చేసి చూపించారు.

0.22 సెకన్స్ దగ్గర కొమురంభీమ్ తన ఆయుధాన్ని చేపడుతున్నాడు. బలమైన ఈటెని విసురుతున్నాడు. ఇక్కడ ఎన్టీఆర్ షర్ట్ లేకుండా కేవలం పంచెకట్టుతోనే కనిపించడాన్ని మనం నోటీస్ చేయచ్చు.

0.30 సెకన్స్ దగ్గర గొలుసులతో కొమురంభీమ్ ని బంధించినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు, నిలబడితే సామ్రాజ్యాలు సాగిలబడతాయి అన్న డైలాగ్ వచ్చినపుడు , బ్రిటిష్ వాళ్లు భయంతో పరుగుతుతీస్తున్నారు. అక్కడ ఒక జట్కాబండి ఫైర్ తో గాల్లోకి లేచింది.

ఇక 0.32 సెకన్స్ దగ్గర బుల్లెట్ ఒకటి స్పీడ్ గా వచ్చింది. దానిపైన DE 9734 నెంబర్ ని మనం నోటీస్ చేయచ్చు. తర్వాత కొమురంభీమ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ఒక జెండాని పైకి లేపుతున్నాడు. దానిపైన జల్ జంగల్ జమీన్ అని రాసి ఉంది. అక్కడే రామరాజు వాయిస్ లో మనకి వాడి పొగరు ఎగిరే జెండా అనే డైలాగ్ వినిపిస్తోంది.

0.38 సెకన్స్ దగ్గర చూసినట్లయితే ఎన్టీఆర్ కంటిలోనుంచి రక్తపు కన్నీటి చుక్క ఒకటి నేలపై పడింది. వెంటనే మనకి భారీ విస్పోటనం జరిగిన షాట్ ని చూపించారు. అంటే ఇక్కడ ఒక్కో రక్తపు బొట్టుకి ఎంత విలువ ఉందో చూపించే ప్రయత్నం చేశారు.

0.46 సెకన్స్ దగ్గర కొమురంభీమ్ రక్తాన్ని తలపై పోస్కుని చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు, ఇక్కడే ఎన్టీఆర్ బాడీని , కండలు తిరిగిన కొమరం భీమ్ పోస్టర్ ని చూపించారు.

0.54 సెకన్స్ దగ్గర ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్, బాడీ మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తోంది. 1.02 సెకన్స్ దగ్గర అల్టిమేట్ రన్నింగ్ చూడచ్చు. కొమురంభీమ్ క్యారెక్టర్ లో పూర్తిగా జీవించేశాడు తారక్.

“తెలంగాణ గిరిజన గోండు బెబ్బులిగా కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ప్రెషన్స్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. ఇక ఈ టీజర్ ఇలా రాంగానే అలా యూట్యూబ్ ని షేక్ చేసేస్తోంది. ట్రెండింగ్ లో దూసుకుపోతోంది

Paritala Murthy – Exclusive


టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus