‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ.. మొదటివారమే ఈమె హౌస్ నుండీ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి మొదట ఈమె నామినేషన్స్ లో లేకపోయినప్పటికీ.. తరువాత హౌస్ మేట్స్ అంతా ఈమెను నామినేట్ చేసేసారు అని అప్పుడు ఈమె ఆరోపణలు వ్యక్తం చేసింది. ఇక తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరిన్ని సంచలన కామెంట్లు చేసింది.
హేమ ‘బిగ్ బాస్ 3’ గురించి మాట్లాడుతూ… ” ‘బిగ్ బాస్ హౌస్’లో నుంచి నేను బయటికివచ్చిన తరువాత, ‘హిమజ’ ఎలిమినేట్ అయ్యేంతవరకూ మాత్రమే షో చూశాను. ఎందుకంటే మిగతా వాళ్ళంతా ఓ గ్రూప్. వాళ్ళందరి మధ్య ఒక ఒప్పందమనేది ముందుగానే జరిగిపోయింది. శ్రీముఖి పుట్టిన రోజున వీళ్ళంతా సమావేశమై, ‘ఏదో ఒకటి చేసి ముందుగా హేమను బయటికి పంపించేయాలి. లేదంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోతుంది’ అనుకునే వచ్చారట. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే నన్ను రెచ్చగొట్టారు. వాళ్ళ ఇంటెన్షన్ తెలియక నేను నా స్టైల్లో సమాధానం చెప్పడం .. ఎలిమినేషన్ లోకి వచ్చేయడం జరిగిపోయింది” అంటూ చెప్పుకొచ్చింది.