గాయకుడు హేమచంద్ర తెలుగు చిత్రాల్లో అనేక హిట్ సాంగ్స్ పాడారు. సింగర్ గా బిజీగా ఉంటూనే తనలోని డబ్బింగ్ ప్రతిభతో అందరి అభినందనలు అందుకుంటున్నారు. గతంలో తమిళ డైరక్టర్ శంకర్ రూపొందించిన “స్నేహితుడు” మూవీలో విజయ్ కి డబ్బింగ్ ( తెలుగు) చెప్పి శెభాష్ అనిపించున్న హేమ చంద్ర, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్, దూకుడు చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టులకు గొంతు అరువు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తోనే ఢీ కొడుతున్నారు. చెర్రీ తాజా చిత్రం ధృవలో తమిళ అలనాటి హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా ఒరిజినల్ వర్షెన్ ‘తనీ ఒరువన్’లో అరవిందే విలన్‌గా నటించారు. అప్పుడు సొంతంగా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. తెలుగులో వచ్చేసరికి చెప్పలేకపోయారు. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులను ఆశ్రయించాలని డైరక్టర్ సురేందర్ రెడ్డి అనుకుంటుండగా హేమ చంద్ర గుర్తుకు వచ్చారు. ఈసారి సింగర్ తో కొత్తగా డబ్బింగ్ చెప్పించారు. యువకుడైన హేమ చంద్ర మధ్యవయస్కుడిగా, డిఫరెంట్ మాడ్యులేషన్ తో అరవింద్ స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పి ధృవ టీమ్ ప్రశంసలు అందుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే వారం (డిసెంబర్ 9 ) విడుదల కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.