తెలుగు చలనచిత్ర పరిశ్రమ సినీ కార్మికులు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వేతనాలను పెంచకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినవారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నుండి షూటింగ్‌లకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మూడేళ్లకు వేతనాలు పెంచాల్సిన నిర్వాహకులు ఇప్పటికీ పెంచలేదని చెబుతున్నారు. వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించాలని నిర్ణయించారు.
అయితే, సినిమా కార్మికుల డిమాండ్స్ వివరాలు బయటికొచ్చాయి. వాళ్లు గత నాలుగేళ్లుగా అడుగుతున్న డిమాండ్స్ ఇలా ఉన్నాయి.
* క్లీనింగ్, ప్రొడక్షన్ బాయ్స్‌కి ప్రస్తుతం రోజుకు రూ. 1145 ఇస్తున్నారు. దానికి 30 శాతం పెంచి రూ. 1488 చేయాలని అడుగుతున్నారు. దాంతోపాటు ఇంతకుముందు ఉన్న బ్రేక్‌ఫాసస్ట్, లంచ్, పికప్ సౌకర్యం కూడా ఇవ్వాలని కోరుతున్నారు.
* ఆదివారం, సెలవు దినాల్లో ప్రస్తుతం రూ. 2290 అందుకుంటున్నారు. దీనిని రూ. 2977కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
* డ్రైవర్‌లకు ఇప్పుడు రోజుకు రూ. 1055 ఇస్తున్నారు. దీనిని రూ. 1362కి పెంచమని అడుగుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా ఏర్పాటు చేయాలి.
* ఆదివారం, సెలవు రోజులలో డ్రైవర్లకు రూ. 2743 ఇవ్వమని కోరుతున్నారు. ప్రస్తుతం ఇది రూ. 2110గా ఉంది.
* లైట్‌మ్యాన్స్‌కి ఇప్పుడు రూ. 1110 ఇస్తుండగా, దానిని రూ. 1440కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
* లైట్‌మ్యాన్స్ ఆదివారం, సెలవు రోజుల్లో పని చేస్తే వారు ఇప్పుడు రూ. 2200 అందుకుంటున్నారు. దానిని రూ. 2860గా మార్చాలని కోరుతున్నారు.
* ఇక ఫైటర్లు, డ్యాన్సర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతం వరుసగా రూ. 3265, రూ. 2800 ఉంది. దానిని ఫైటర్లకు రూ. 4244కి పెంచాలని కోరుతుండగా, డ్యానర్లకు రూ.3640 ఇవ్వాలని అడుగుతున్నారు.
మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నోటీసులు అందలేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ అన్నారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్‌ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలన్నారు. అలాంటి నోటిసు ఫిల్మ్ ఛాంబర్‌కు ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు ఈ విషయంలో నిర్ణయం రావొచ్చు అంటున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!