ఇండియా మొత్తం కవర్ చేసిన నెట్ ఫ్లిక్స్.. కొత్త కంటెంట్ లైబ్రరీ అదిరింది

ప్రతి ఏడాది ఓటీటీ సంస్థలు తమ కొత్త సినిమాలు/సిరీస్ ల లిస్ట్ విడుదల చేయడం అనేది ఆనవాయితీ. అయితే.. 2025లో నెట్ ఫ్లిక్స్ (Netflix) సంస్థ విడుదలై చేసిన లిస్ట్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. లైబ్రరీ అలా ఉంది మరి. ముందుగా తెలుగులో అడుగిడుతూ, నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ గా “సూపర్ సబ్బు” ఎనౌన్స్ చేసింది.

Netflix

1. సూపర్ సబ్బు

సందీప్ కిషన్ (Sundeep Kishan) ప్రధాన పాత్రలో “సూపర్ సబ్బు” అనే సిరీస్ అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్ (Netflix). మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బ్రహ్మానందం (Brahmanandam), మానస చౌదరి, ఆది, కీలకపాత్రలు పోషిస్తుండగా.. సందీప్ కిషన్ ఈ చిత్రంలో “మాకీపూర్” అనే గ్రామంలో జనాభా తగ్గించడం కోసం పాటు పడే ఉద్యోగిగా కనిపించనున్నాడు.

2. రానా నాయుడు సీజన్ 2

రానా నాయుడు (Rana Naidu)  మొదటి సీజన్ ఎంత రచ్చ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ బూతులు మాట్లాడడాన్ని చాలామంది జీర్చించుకోలేకపోయారు. ఇప్పుడు ఈ సిరీస్ రెండో సీజన్ రానుండడం, ఇందులో ఇంకెన్ని బూతులు, బోల్డ్ సీన్స్ ఉంటాయో అని ఆసక్తి మొదలైంది.

3. జ్యువల్ తీఫ్

సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)  & జయదీప్ అలావత్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం “జ్యువెల్ తీఫ్”. సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణ సారథ్యంలో.. కూకి గులాటి & రూబీ గ్రూవాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హైటెక్ దొంగతనం కోణంలో ఓ వజ్రం కోసం జరిగే హంగామా అని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూడాలి.


4. టోస్టర్

రాజ్ కుమార్ రావు(Rajkummar Rao), సన్యా మల్హోత్ర (Sanya Malhotra)  జంటగా వివేక్ దాస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “టోస్టర్”. ఓ కక్కుర్తి వ్యక్తి పెళ్లికి గిఫ్ట్ ఇచ్చిన టోస్టర్ చుట్టు తిరిగే కథ ఇదని టీజర్ తోనే అర్థమవుతుంది. ఆ టోస్టర్ ను తిరిగి సంపాదించడానికి రాజ్ కుమార్ రావు వేసే వేషాలే ఈ చిత్రం.

5. ఢిల్లీ క్రైమ్

నెట్ ఫ్లిక్స్ ఉనికిని ఇండియాలో పాపులర్ చేసిన సిరీస్ “ఢిల్లీ క్రైమ్”. అనంతరం వచ్చిన సెకండ్ సీజన్ కూడా అలరించింది. ఇప్పుడు ఈ సిరీస్ కి మూడో సీజన్ ఎనౌన్స్ చేశారు. షెఫాలీ షా తోపాటు ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషి (Huma Qureshi) కీలకపాత్ర పోషిస్తోంది. తనూజ్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 3వ సీజన్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

6. ఆప్ జైసా కోయి 


మాధవన్  (Madhavan),”దంగల్” ఫేమ్ ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో “ఆప్ జైసా కోయి” అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ టీజర్ చాలా క్యూట్ గా ఉంది. వివేక్ సోనీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ధర్మ ప్రొడక్షన్ నిర్మిస్తుండడం విశేషం.

7. కోరా సీజన్ 2 


గతేడాది నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేసిన పంజాబీ సిరీస్ కోరా. ఈ సిరీస్ కు సెకండ్ సీజన్ గా “కోరా 2” వస్తోంది. బరుణ్ సోబిత్, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

8. మండల మర్డర్స్ 


వాణీ కపూర్ (Vaani Kapoor), సుర్వీన్ చావ్లా (Surveen Chawla), వైభవ్ రాజ్ గుప్తా ప్రధాన పాత్రల్లో ప్యారలల్ లైవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సిరీస్ “మండల మర్డర్స్”. యాక్షన్ & పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి గోపి పుత్రన్ దర్శకుడు.

9. అక్క 


టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సిరీస్ “అక్క”. కీర్తి సురేష్ (Keerthy Suresh), రాధిక ఆప్టే (Radhika Apte)  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

10. గ్లోరీ 


పులకిత్ సామ్రాట్ (Pulkit Samrat), దివ్యేందు (Divyenndu) ప్రధాన పాత్రల్లో నెట్ ఫ్లిక్స్ ఎనౌన్స్ చేసిన కొత్త సిరీస్ “గ్లోరీ”. బాక్సింగ్ బ్యా డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సిరీస్ కి కరణ్ అన్షుమాన్ – కర్మణ్య అహుజా దర్శకులు.

11. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ 


నీరజ్ పాండే (Neeraj Pandey) దర్శకత్వంలో తెరకెక్కిన “ఖాకీ” సిరీస్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ సిరీస్ కి సెకండ్ సీజన్ గా “ఖాకీ: ది బెంగాల్ చాప్టర్” ఎనౌన్స్ చేశారు. బెంగాలీ టాప్ స్టార్ జిత్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. చిత్రాంగద, ఆకాంక్ష శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

12. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో: సీజన్ 3


అందరి ఫేవరెట్ కపిల్ శర్మ (Kapil Sharma) హోస్ట్ చేస్తున్న “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో” 3వ సీజన్ ను ఎనౌన్స్ చేశారు. బాలీవుడ్ తారలు మాత్రమే కాక మన సౌత్ హీరోహీరోయిన్లు కూడా అప్పుడప్పుడు కనిపించే ఈ షోకి ఉన్న ఫ్యాన్ బేస్ కి 10 సీజన్లు తీసినా తప్పు లేదు.

13. ది రాయల్స్

ప్రియాంక ఘోష్ & నుపుర్ ఆస్థాన దర్శకత్వంలో ఇషాన్ కట్టర్ (Ishaan Khatter), భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సిరీస్ “ది రాయల్స్”.

14. టెస్ట్ 


మాధవన్, సిద్ధార్థ్ (Siddharth), నయతార (Nayanthara), ప్రధాన పాత్రల్లో వైనాట్ స్టూడియోస్ సంస్థ రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన సినిమా “టెస్ట్”. సిద్ధార్థ్ క్రికెటర్ గా కనిపించనున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలకానుంది. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టీజర్ ఓ మోస్తరు అంచనాలు నమోదు చేయగలిగింది.

15. సారే జహాన్ సే అచ్చా 


“స్కాం” ఫేమ్ ప్రతీక్ గాంధీ (Pratik Gandhi), తిలోత్తమ (Tillotama), సన్నీ హిందూజా (Sunny Hinduja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న స్పై సిరీస్ “సారే జహాన్ సే అచ్చా”. టీజర్ తోనే మంచి ఆసక్తి నెలకొల్పింది.

16. వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్

స్టాండప్ కామెడీ సిరీస్ లో భాగంగా వీర్ దాస్ తో “ఫూల్ వాల్యూమ్” అనే స్పెషల్ షోను లాంచ్ చేసింది నెట్ ఫ్లిక్స్(Netflix) .

17. ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్


షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న కొత్త షో “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”. షారుక్ ఖాన్ స్వయంగా అనౌన్స్మెంట్ టీజర్ లో నటించి మరీ కొడుకును ఇంట్రడ్యూస్ చేయడం గమనార్హం.

‘మదగజరాజ’ తో పాటు ఈ 10 మంది స్టార్ల సినిమాలు కూడా ఏళ్ళ పాటు రిలీజ్ కాలేదు..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus