హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అబ్బాస్ కూతురు.. ఫోటోలు వైరల్..!

‘ప్రేమదేశం’ తో తెలుగు, తమిళ భాషల్లో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. ఆ తర్వాత ఇతనికి వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే అందులో హీరోగా చేసినవి తక్కువ.సెకండ్ హీరోగా చేసినవి ఎక్కువ అన్నట్టు ఉన్నాయి. అందువల్ల ఇతను స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.అయితే ఇతను అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు పాపులర్ అయ్యాడు. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సెలూన్ కు వెళ్లి అబ్బాస్ హెయిర్ స్టైల్ కావాలి అని చెప్పి కటింగ్ వేయించుకున్న బ్యాచ్ కూడా ఉన్నారు.

ఇక తెలుగులో కూడా అబ్బాస్… రాజా, కృష్ణబాబు, ప్రియా ఓ ప్రియా వంటి సినిమాల్లో ఇతను నటించడం జరిగింది. తర్వాత విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించాడు. అందులో నితిన్ నటించిన ‘మారో’ మూవీ కూడా ఒకటి. ఇదిలా ఉండగా.. అబ్బాస్ కొన్నాళ్లుగా విదేశాల్లో ఉంటూ మోటివేషనల్ క్లాసెస్ చెప్పే జాబ్ చేస్తున్నాడు.కొన్నాళ్లుగా ఇతను సినిమాల్లో కనిపించడం లేదు… భవిష్యత్తులో కనిపించే అవకాశమే లేదని చెప్పేశాడు. ఇదిలా ఉండగా.. అబ్బాస్ ఫ్యామిలీ గురించి జనాలకు పెద్దగా తెలీదు.

అతని భార్య పేరు ఇరుమ్ అలీ. వీరికి ఓ కొడుకు అయిమాన్, కూతురు ఎమిరా అలీ ఉన్నారు. అబ్బాస్ లానే అతని భార్యా పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు. ప్రస్తుతం అబ్బాస్ కూతురు ఎమిరా అలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె ఉంది. ఆమె ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus