Ajith: ఫ్యాన్స్ పై హీరో అజిత్ సీరియస్.. కారణమిదే..?

Advertisement

తమిళనాడు రాష్ట్రంలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ తన భార్య షాలినితో కలిసి తిరువాయన్మూర్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటు వేసి బయటకు వచ్చిన తరువాత కొందరు అభిమానులు అజిత్ ను సెల్ఫీల కోసం చుట్టుముట్టారు. ఇష్టమైన హీరో కావడంతో అజిత్ తో ఫోటో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

అభిమానుల ప్రవర్తనతో విసుగు చెందిన అజిత్ ఒక అభిమాని ఫోన్ ను జేబులో పెట్టుకున్నారు. ఆ తరువాత అభిమానులు వెళ్లిపోవాలంటూ అజిత్ వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కూల్ గా ఉండే అజిత్ అభిమానుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డారని అర్థమవుతోంది. గతంలో కూడా అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించిన సమమయంలో అజిత్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో సూర్య, సూర్య తమ్ముడు కార్తీ, కమల్ హాసన్, శృతిహాసన్, అక్షరహాసన్, స్టార్ హీరో విజయ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విషయంలో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.


వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus