రాజశేఖర్ షూటింగ్ మొదలుపెట్టేశాడు..!

యాంగ్రీ ఎంగ్ మాన్ రాజశేఖర్ సరికొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. శేఖర్ అనే టైటిల్ ని ఎనౌన్స్ చేస్తూ రాజశేఖర్ 91వ చిత్రంగా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని చెప్తున్నారు. రీసంట్ గా కరోనా నుంచి కోలుకున్న యాంగ్రీ ఎంగ్ మాన్ రాజశేఖర్ తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్ వేదికగా పోస్టర్ ని విడుదల చేశారు. అబిమానుల ప్రార్ధనలు, ప్రేమ నేను కోలుకోవడానిక కారణం అంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు హీరో రాజశేఖర్.

ఇక రాజశేఖర్ ఇమేజ్ కి తగ్గట్లుగానే నోట్లో వెలుగుతున్న సిగరెట్ తో యంగ్ గా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాని తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్నారు. రాజశేఖర్ తో కలిసి ఈసారి జీవిత కూడా సిల్వర్ స్క్రీన్ షేర్ చేస్కోబోతుందని అంటున్నారు. చాలాకాలం తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారట. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అదిస్తుండగా, లలిత్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సినీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేశారని, అతి త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలని షేర్ చేస్తామని చెప్తోంది చిత్రయూనిట్. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus