గోపీచంద్ సరసన సాయిపల్లవి సెట్ అయినట్లేనా..?

యాక్షన్ హీరోగా గోపిచంద్ టాలీవుడ్ లో తనదైన మార్క్ ని సెట్ చేసుకున్నాడు. వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కుంటున్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేస్కున్నాడు. సీటీమార్ అంటూ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా తో కలిసి రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత మారుతీ డైరక్షన్ లో సినిమాని మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసందే. ప్రభాస్ సపోర్ట్ తో గోపిచంద్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడట. అందుకే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

మరోవైపు మారుతీతో ఒప్పందం ఉండటంతో పాటు డార్లింగ్ ఇచ్చిన భరోసాతో గీతాఆర్ట్స్ 2 కూడా ఈసినిమాని సంయుక్తంగా నిర్మించేందుకు చూస్తోంది. నిజానికి తక్కువ బడ్జెట్ లోనే ఈసినిమాని పూర్తి చేయబోతున్నారని వార్తలు వస్తున్న టైమ్ లో హీరోయిన్ ఎంపికే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన సాయిపల్లవిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే అమ్మడు వరస సినిమాలతో బిజీగాగా ఉన్న టైమ్ లో ఈ సినిమాకి డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, రీసంట్ గా అమ్మడు రెమ్యునిరేషన్ ని కూడా పెంచేసింది.

మరి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కే సినిమాలో అమ్మడిని ఎలా తీసుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ సాయిపల్లవి ఒప్పుకోకపోతే కొత్త భామని తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉందట చిత్రయూనిట్. టిక్ టాక్ తో ఫేమస్ అయిన ఓ కుర్రదాని పేరుని పరిశీలిస్తున్నారు. ఈ పండగ కానుకగా గోపిచంద్ అభిమానుల కోసం టైటిల్ లుక్ ని రివీల్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి అదీ విషయం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus