Kalyan Ram: ఆ విషయాల్లో కళ్యాణ్ రామ్ గ్రేట్ అంటున్న తారక్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. డెవిల్ ట్రైలర్ కు 20 గంటలలో 4.5 మిలియన్ల వ్యూస్ రాగా నందమూరి అభిమానులను ఈ ట్రైలర్ ఎంతగానో నచ్చేసింది. అయితే డెవిల్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు కళ్ల నుండి ఆనంద భాష్పాలు తెప్పిస్తున్నాయి.

డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా (Kalyan Ram) కళ్యాణ్ రామ్ దేవర గురించి మాట్లాడటం, తమ్ముడికి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కళ్యాణ్ రామ్ పరోక్షంగా చెప్పడం, తమ్ముడిని తండ్రిలా ప్రేమగా చూసుకుంటున్న కళ్యాణ్ రామ్ అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా విషయాలలో కళ్యాణ్ రామ్ గ్రేట్ అంటూ నందమూరి అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు డెవిల్ మూవీ 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. డెవిల్ ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సరికొత్త కాన్సెప్ట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.

సలార్ మూవీ విడుదలైన వారం రోజుల తర్వాత డెవిల్ మూవీ థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. డెవిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సినిమాలు విడుదలయ్యే వరకు డెవిల్ సినిమాకు పోటీ లేదని చెప్పవచ్చు. డెవిల్ సినిమా ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించడం ఖాయమని మరి కొందరు కామెంట్లు వినిపిస్తున్నాయి. డెవిల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. డెవిల్ సినిమాలో ట్విస్టులు ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus