Karthi: ‘సర్ధార్’తో ఒత్తిడి తగ్గిందంటున్న హీరో!

కోలీవుడ్ హీరో కార్తి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కార్తి కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా తమిళనాట భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న కార్తికి ‘సర్దార్’ రూపంలో మరో హిట్టు వచ్చింది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా.. ఇక్కడ కూడా హిట్ టాక్ దక్కించుకుంది. తమిళంలో అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

తొలివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కార్తి కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ తో తనపై చాలా ఒత్తిడి తగ్గిందని అంటున్నారు కార్తి. కార్తి హీరోగా కెరీర్ మొదలుపెట్టి పదిహేనేళ్లు దాటేసింది. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే స్టార్ హీరోల లిస్ట్ లో మాత్రం చేరలేకపోయారు. ఇలాంటి సమయంలో వరుస విజయాలు కార్తికి ఊరట ఇచ్చే అంశాలే. ఈ సినిమా తమిళ నిర్మాత.. తన చిన్నప్పటి స్నేహితుడని.. ఈ హిట్ తో అతడికి లాభాలు ఇవ్వడం తనకు మంచి అనుభూతి ఇచ్చిందని కార్తి చెప్పుకొచ్చారు.

లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని వసూళ్లను రాబడుతుందో చూడాలి. తెలుగులో కూడా దీపావళికి విడుదలైన సినిమాల్లో కార్తి ‘సర్ధార్’ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కార్తి స్వయంగా ప్రకటించారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus