కార్తీ హీరోగా తెరకెక్కిన ‘జపాన్’ సినిమా నవంబర్ 10న రిలీజ్ కాబోతుంది. ‘జోకర్'(తమిళ్ సినిమా) ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన మూవీ ఇది. ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది. కార్తీ 25వ సినిమాగా ఈ మూవీ రూపొందింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీ కోసం :
ప్ర) ‘జపాన్’ అనేది ఓ దొంగ కథ అనే టాక్ వినిపిస్తోంది.. అందులో నిజం ఎంత ఉంది?
కార్తీ : ‘జపాన్’ ఇది రియల్ స్టోరీ కాదు. కానీ ఇన్స్పిరేషన్ అయితే ఉంది.దర్శకుడు రాజు మురుగన్ కూడా ఓ రిపోర్టర్ కాబట్టి అతని అనుభవాలతో ఈ సినిమా రూపొందింది. ఆయన గత సినిమా ‘జోకర్’ నేషనల్ అవార్డు కొట్టింది. జపాన్ లో ఇంకో కొత్త కోణం ఉంటుంది. ఇందులో సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి.
ప్ర) ఈ సినిమాకి ‘జపాన్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
కార్తీ : అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించింది.
ప్ర) ‘జపాన్’ మీ మేకోవర్ కొత్తగా ఉంది?
కార్తీ : రాజు మురుగన్ నా కోసం ఓ కథ రాశారు. ఈ పాత్ర చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ పాత్ర కు కొత్త కార్తి కావాలి. దానికి తగ్గట్టే నా గెటప్ మొత్తం మార్చుకున్నాను. దీని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను.
ప్ర) జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉంటుంది?
కార్తీ : ఆయన తన మ్యూజిక్ తో ఎలాంటి సీన్ ని అయినా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు.
ప్ర) మీరు కథలు ఎంపిక చేసుకునేప్పుడు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే ఎంపిక చేసుకుంటారా?
కార్తీ : ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో థియేటర్ కి వస్తారు. కాబట్టి వాళ్ళు అన్నీ మర్చిపోయి సినిమాని ఎంజాయ్ చేయాలి. దానికి తగ్గ మ్యాజిక్ ఉందా లేదా అనేది చూస్తాను.
ప్ర) మీరు చేసిన దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేయరు.. కారణం?
కార్తీ : నేను ప్రతి సినిమాకి కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటాను. ఇది నాకు పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నా వరకూ నేను చేసిన ప్రతి సినిమా, కథ, పాత్ర డిఫరెంట్ గా ఉండే లాగా చూసుకుంటాను. ప్రతిసారీ ఏదో డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తాను. కొన్ని సార్లు అది నాకు వర్కౌట్ అవుతుంది. ఇంకొన్ని సార్లు వర్కౌట్ అవ్వదు.
ప్ర) వరుసగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో మీ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది?
కార్తీ : హ్యాపీ అండి.! సంతోషంగా ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా నా సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది నాకు పెద్ద బలం అని నేను భావిస్తున్నాను.
ప్ర) మీతో సినిమా చేస్తే ఏ డైరెక్టర్ అయినా స్టార్ డైరెక్టర్ అయిపోతాడు అంటారు.? దాని గురించి ఏమంటారు?
కార్తీ : అది నేను నమ్మను. వాళ్ళ టాలెంట్ బట్టి.. ఎదుగుతారు. నేను కాకపోతే ఇంకొకరు ఛాన్స్ ఇవ్వొచ్చు. అందులో ఏముంది. కానీ అందరూ బిజీ అవుతున్నారు. బాలీవుడ్లో కూడా సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు. అందుకు నేను హ్యాపీ.
ప్ర) ‘ఖైదీ 2’ ఉంటుందా? అందులో రోలెక్స్ పాత్ర కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
కార్తీ : దాని కోసం నేను కూడా వెయిటింగ్ ( నవ్వుతూ). స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. రోలెక్స్ గురించి లోకేష్ ని అడగండి. ప్రస్తుతానికి అతను రజినీకాంత్ గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి.. అది కంప్లీట్ అయ్యాక ఉంటుంది.
ప్ర) జపాన్ కి సీక్వెల్ ఉంటుందా?
కార్తీ : కచ్చితంగా దీనికి సీక్వెల్, ప్రీక్వెల్ ఒకటి ఉండాలి అని డైరెక్టర్ తో నేను (Karthi) ముందుగానే చెప్పాను. ఈ సినిమాకి ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ ను బట్టి.. వాటి గురించి ఆలోచించాలి.
ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
కార్తీ : ‘సూదుకవ్వం’ డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే ’96’ డైరెక్టర్ తో కూడా ఓ సినిమా చేయాలి. ‘ఖైదీ 2’, ‘సర్దార్ 2’ వంటివి కూడా చేయాలి..!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!