కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.’అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి ఐ.ఎం.డి.బి లో అయితే మంచి రేటింగ్ వచ్చింది కానీ క్రిటిక్స్ నుండీ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనే విధంగా నమోదయ్యాయి. కానీ ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ చిత్రం స్లో అయిపోయింది.ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
0.94 cr
సీడెడ్
0.47 cr
ఉత్తరాంధ్ర
0.49 cr
ఈస్ట్
0.24 cr
వెస్ట్
0.18 cr
గుంటూరు
0.29 cr
కృష్ణా
0.18 cr
నెల్లూరు
0.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.09 Cr
ఓవర్సీస్
0.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.07 cr
‘హీరో’ చిత్రానికి రూ.5.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.3.07 కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో బయ్యర్లకి రూ.2.93 కోట్ల నష్టం వాటిల్లింది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ దీని వల్ల నిర్మాతలకి కలిసొచ్చేది ఏమీ లేదు.
ఓవరాల్ గా ఈ చిత్రానికి రూ.20 కోట్ల బడ్జెట్ పెట్టగా..థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ కలుపుకుని కేవలం రూ.13 కోట్లు మాత్రమే రికవరీ అయ్యిందట.