Nani: అందుకే అందరూ నన్ను ‘ఇతను మనవాడే’ అనుకుంటారు: నాని

హీరో నానిని చాలామంది ‘బాయ్‌ నెక్స్ట్‌ డోర్‌’ అని అంటుంటారు. అదేనండీ ‘పక్కింటి కుర్రాడు’ అని. అలా ఎందుకు అంటారు, మిగిలిన హీరోలకు నానికి ఏంటి తేడా అని కూడా అంటుంటారు. అయితే దీనికి సమాధానం నానినే చెప్పాడు. ‘ఇతను మనవాడే’ అని సగటు ప్రేక్షకుడు ఎందుకు అనుకుంటాడో చెప్పుకొచ్చాడు. తనదైన శైలిలో కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకుసాగుతున్న నాని మరోసారి డిఫరెంట్‌ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే ‘హాయ్‌ నాన్న’.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా తన గురించి, తన తనయుడితో అనుబంధం గురించి మాట్లాడాడు. పిల్లలంటే తనకు ఇష్టమని, ప్రయాణాల్లో, విమానాశ్రయాల్లో పిల్లలతో పెద్దవాళ్లు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘నేను చూసుకోనా?’ అని దగ్గరికి తీసుకుంటాడట. అప్పుడు ఆ పిల్లలు హ్యాపీగా తనతో ఊసులాడతారట, మాట్లాడతారట. అందుకేనేమో పెద్దవాళ్లలోనూ ‘ఇతను మనవాడే’ అనే అభిప్రాయం కలుగుతుంటుంది అని చెప్పాడు నాని.

మీరు ఓ కొడుక్కి తండ్రి కాబట్టి ‘హాయ్‌ నాన్న’ సినిమా కథ ఓకే చేశారా అని అడుగుతుంటారు. కథ విన్న తర్వాత ఆ క్షణంలో ఓ బలమైన అభిప్రాయం కలుగుతుంది. దాన్ని నమ్మే సినిమా చేస్తాను. ఈ సినిమాను కూడా అలానే చేశాను అని చెప్పాడు నాని. ఇక కథల ఎంపిక గురించి చెబుతూ… ఏదైనా కథ వింటే, ఆ క్షణమే చెప్పేస్తా. ఇక వారం తర్వాత, నెల తర్వాత, ఏడాది తర్వాత ఆలోచిస్తా అని తిప్పించుకోను అని తెలిపాడు.

‘జెర్సీ’ సినిమాలో, ‘హాయ్‌ నాన్న’ సినిమాలో చిన్న పిల్లలతో నటించాడు (Nani) నాని. ఎలా ఉంది ఆ ఫీలింగ్ అని అడిగితే… చాలా సరదాగా అనిపించింది అని చెప్పాడు. వాళ్ల అబ్బాయి జున్ను (అర్జున్‌) తనను నాన్న అనే పిలుస్తుంటాడట. ఒకవేళ తనతో ఇంగ్లిష్‌ మాట్లాడటానికి ప్రయత్నిస్తే నాని వినడట. ఆ తర్వాత జున్ను అర్థం చేసుకుని తెలుగులో మాట్లాడుతుంటాడట. ఈ ఆలోచనేదో బాగుంది కదా. ఎంతమంది ఫాలో అవుతారో చూద్దాం.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus