Hero Nani: నాటి కామెంట్స్‌ వివరణ ఇచ్చిన నాని.. ఇకనైనా!

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లపై స్పందించిన హీరోల్లో పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి తర్వాత నానినే అని చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ అగ్రెసివ్‌గా మాట్లాడితే.. చిరంజీవి కూల్‌గా మాట్లాడారు. నాని అయితే పవన్‌ కల్యాణ్‌ను ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ఆయన థియేటర్లు – కిరాణా షాపులను పోలుస్తూ ఓ కామెంట్‌ చేశాడు. నాని ఏ అర్థంలో చెప్పాడో కానీ, కొన్ని వర్గాలు మాత్రం దానికి నాని vs కిరాణా షాపులు చేసేశాయి. అప్పట్లో దానిపై మౌనం వహించిన నాని, ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఇకనైనా ఆ చర్చ ఆగుతుందేమో చూడాలి.

మామూలుగా నాని వివాదాలకు దూరంగా ఉంటాడు. కోరి ఏ గొడవలోనూ తల దూర్చింది లేదు. అయితే అనుకోకుండా, తనకు సంబంధం లేకుండా ‘బిగ్ బాస్’ షో సమయంలో ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. ఇక కొన్ని నెలల కిందట ఇండస్ట్రీ గురించి ఘాటుగా స్పందించి ట్రోల్‌ అయ్యాడు. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్ టికెట్ల ధరల సమస్య మీద మాట్లాడాడు నాని. సినిమా థియేటర్ల కౌంటర్ కంటే.. పక్కనుండే కిరాణా కొట్టు కౌంటర్ మెరుగ్గా ఉందని అన్నాడు. అలాంటపుడు థియేటర్లను నమ్ముకున్న వాళ్లు ఎలా బతుకుతారని నాని ప్రశ్నించాడు.

దీంతో ఏపీలో నాని సినిమాకు ఇబ్బందులు తప్పలేదు. అప్పుడు ఈ విషయంలో కామ్‌గా ఉన్న నాని.. ఇటీవల మీడియాను కలిసినపుడు వివరణ ఇచ్చాడు. రేట్లు మరీ తగ్గించడం గురించి తాను ఆ రోజు ఆవేదన వ్యక్తం చేశానని, ఇప్పుడు రేట్లు పెరగడం కూడా సమస్యే అని నాని అన్నాడు. దాంతోపాటు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తానేమీ కిరాణా కొట్టు వాళ్లను కించపరచలేదని చెప్పాడు. అంతేకాదు తాను గతంలో హైదరాబాద్ అమీర్‌పేటలో ఇమేజ్ హాస్పిటల్ పక్కన కిరాణా స్టోర్‌లో పని చేశానని కూడా చెప్పాడు నాని.

కిరాణా స్టోర్‌ను నడపడానికి మెయింటైనెన్స్ రూ.15 వేలు అవుతుంది అనుకుంటే ఆదాయం రూ.25 వేలు వస్తుంది అనుకుందాం అప్పుడు యజమాని బతకగలుగుతాడని, మరి థియేటర్ నడపాలంటే నెలకు రూ. లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటప్పుడు కిరాణా కొట్టుతో సమానంగా, లేదంటే తక్కువగా ఆదాయం వస్తే దాన్ని యజమాని ఎలా నడుపుతాడని అప్పుడు తాను ప్రశ్నించానని నాని వివరణ ఇచ్చాడు. అయితే తన కామెంట్లను అప్పుడు ఎవరికి తోచిన భాష్యాలు వాళ్లు ఇచ్చారని, తద్వారా తనను ట్రోల్ చేశారని అన్నాడు నాని. నాని తాజా వివరణతో నాటి కామెంట్లపై చర్చ ఆగిపోతుందేమో చూడాలి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news