Hero Nani: నానికి ఆ పాత్ర అంటే అంత ఇష్టమా?

  • January 19, 2022 / 05:57 AM IST

నాచురల్ స్టార్ నాని తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులతో డీలా పడిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో దసరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సాధారణంగా హీరోలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడరు.

ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. జెంటిల్ మేన్, వి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి నాని మెప్పించారు. ఈ సినిమాలలో జెంటిల్ మేన్ హిట్ గా నిలిస్తే వి మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

అయితే నాని మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ఈ పాత్ర అంటే నానికి అంత ఇష్టమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఈ సినిమాకు కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది. నాని ఈ సినిమాతో పాటు అంటే సుందరానికి సినిమాలో కూడా నటిస్తున్నారు. వరుసగా సినిమాలలో నటిస్తూ నాని కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను నాని విడుదల చేస్తున్నారు. నాని ఎక్కువగా పక్కింటి అబ్బాయి తరహా పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉండటంతో వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు నాని పది కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నవ్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ ఉండటంతో నానికి విజయాలు దక్కుతున్నాయి. ప్రేక్షకుల్లో నానికి సినిమాసినిమాకు ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ పెరుగుతోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus