‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం వినాయక్ చవితి కానుకగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శివ నిర్వాణ పాల్గొని హీరో నాని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ.. ” ‘టక్ జగదీష్’ లో నాని ఓ సరదా మనిషి. బయటి నుండీ ఏ ప్రాబ్లం అయినా వస్తే ఇరగ్గొడతాడు. అదే ఇంట్లోనే సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది కథ.విజిల్స్ పడే సీన్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్లు కూడా థియేటర్లకు రాలేరు. దాంతో నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇరవై ఏళ్ల కుర్రాడు కూడా కలిసి చూసేలా ఓటిటిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ ఓటీటీలో రావడం పై నెగెటివ్స్ కన్నా పాజిటివ్‌సే చూస్తున్నాను.
‘నిన్ను కోరి’ తర్వాత నాని గారితో వెంటనే ఓ సినిమా చేయాలని అనుకున్నప్పుడు.. ఆయనకి ఫోన్ చేశాను. వెంటనే ఆఫీస్‌కు రమ్మన్నారు. పది నిమిషాల్లోనే కథ చెప్పాను. ఆ చెప్పడమే ఓ ట్విస్ట్ ను జోడించి చెప్పాను. అది ఆయనకి బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసారు. నేను లవ్ స్టోరీగాని చెబుతానేమో .. ఎలా రిజెక్ట్ చేయాలా? అని ఆయన అప్పుడు అనుకున్నారట. కానీ నేను కథ చెప్పడమే .. భూదేవీపురం, భూకక్షలు అంటూ మొదలుపెట్టడంతో నాని ఎగ్జైట్ అయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!