నేచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాది ‘సరిపోదా శనివారం’ తో (Saripodhaa Sanivaaram) ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాడు. ప్రస్తుతం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3’ సినిమాలో నటిస్తున్నాడు. అర్జున్ సర్కార్ అనే టిపికల్ కాప్ రోల్లో నాని ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ‘కేజీఎఫ్’ (KGF) బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2025 మే 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు టీం ప్రకటించింది. మరోపక్క నాని ఇంకో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తున్న సంగతి తెలిసిందే.
‘దసరా’ తో (Dasara) తనని వంద కోట్ల క్లబ్లో చేర్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి ‘పారడైజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇటీవల మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా ఉంటుందని’ నాని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. సినిమాలో వయొలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని, బెడ్ రూమ్ సీన్స్ వంటివి కూడా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
యాక్షన్ డోస్ అయితే ఇంకా ఎక్కువట. దీంతో ‘పారడైజ్’ సినిమా కోసం నాని స్పెషల్ కేరింగ్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం నాని ప్రత్యేకంగా కరాటే నేర్చుకుంటున్నాడట. బ్లాక్ బెల్ట్ పొందిన వారి నేతృత్వంలో నాని రోజుకి గంటన్నర పాటు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ పక్కనే ఏర్పాటు చేసిన స్థలంలో నాని కరాటే నేర్చుకుంటున్నాడు అని తెలుస్తుంది.
‘దసరా’ కోసం నాని తెలంగాణ స్లాంగ్లో మాట్లాడటానికి ముగ్గురు ట్రైనర్స్ ని పెట్టుకుని శిక్షణ పొందాడు.అంతకు ముందు ‘జెర్సీ’ (Jersey) కోసం కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ ను పెట్టుకుని క్రికెట్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు. ‘చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి’ అనేది నాని సిద్ధాంతం. అందుకే ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇవ్వడానికి పరితపిస్తుంటాడు.