ఇంట్లో అమ్మనాన్న పర్స్‌లో డబ్బులు కొట్టేయడం, ప్రోగ్రెస్ రిపోర్టుల్లో సంతకం పెట్టడం, రోజులు తరబడి స్నానం చేయకుండా ఉండటం.. ఇదేంటి సగటు కుర్రాడు చేసే పనులు అన్నీ చెబుతున్నారు అని అనుకుంటున్నారా? అవును మేం చెబుతున్నవి ఆ విషయాలు.. అయితే పై మూడు విషయాల్లో నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నాడు అని తెలుసా? అంత పెద్ద హీరో ఇలాంటి పనులు చేసి ఉంటాడా? అని అంటారా? ఈ మాట నాని దగ్గర అంటే అవును నేను కూడా చేశా అంటూ పాత విషయాలు చెప్పుకొచ్చాడు.
చిన్నతనంలో ఐస్‌క్రీమ్ అడిగితే వాళ్లింట్లో అమ్మ ఒప్పుకునేవారు కాదట. వాటి తయారీ చేసేటప్పుడు ఏ నీళ్లు వాడారో, ఆరోగ్యానికి మంచిది కాదేమో అని వద్దనేవారట. కానీ ఓసారి ఎవరూ చూడలేదు అనుకుంటూ నాని… అమ్మ పర్సు నుండి ఐదు రూపాయలు కొట్టేశాడట. ఆ డడబ్బులతో ఐస్‌క్రీమ్ కొనుక్కుని తినేసి, ఆ తర్వాత ఎంతో నిజాయతీగా అందులో మిగిలిన మూడు రూపాయల చిల్లర పర్సులో పెట్టేద్దాం అనుకున్నాడట. సరిగ్గా ఆ సమయంలో వాళ్లమ్మ చూసేశారట. దీంతో బాగా కోప్పడ్డారట.
మీ ప్రోగ్రస్ రిపోర్టులో ప్రతిసారి మీ పేరెంట్సే సంతకం పెట్టారా? ఈ ప్రశ్నకు చాలామంది నుండి నో అనే సమాధానం వస్తుంది. నాని కూడా ఇదే మాట అంటున్నారు. నాని చదువుల్లో తోపేమీ కాదు. ఈ విషయంలో చాలా సార్లు చెప్పాడు కూడా. అలా ఒకసారి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పాడట నాని. నాన్న చూస్తే ఎక్కడ ఏమంటారో అనుకుని, ఆయనకి చూపించకుండానే ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టేశాడట. అయితే మళ్లీ ఎప్పుడూ ఆ పని చేయలేదట.
ఇక మూడోది ఆఖరికి అయిన స్నానం. చలికాలంలో రోజూ స్నానం చేయడం అంటే చిరాకు. అందుకే స్కిప్ చేసేస్తుంటారు చాలామంది. అయితే నాని చలికాలంలో కాదు కానీ, మనాలీలో ‘ఎవడే సుబ్రమణ్యం’ షూటింగ్ సమయంలో ఇలా చేశారట. ఆ సినిమా కోసం 42 రోజులు అక్కడ ఉన్నారట. ఆ సమయంలో నాని రెండేసార్లు స్నానం చేశాడట. స్నానం టాపిక్ ఎప్పుడొచ్చిన ఆ రోజులే గుర్తొస్తుంటాయట నానికి.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!