హీరో నాని తన ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడని తెలిసిన వెంటనే ఎగ్జిబిటర్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత విషయం సద్దుమణిగింది. తాజాగా ఈ విషయంపై నాని రియాక్ట్ అయ్యాడు. ఫ్యూచర్ లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ.. తను ఓటీటీకి వెళ్తే.. అప్పుడు తనకు తానే స్వీయనిర్బంధం విధించుకుంటానని చెప్పుకొచ్చాడు. తన సినిమాలను థియేటర్లలో ఆపేస్తామన్నారని.. నిజంగా బయట పరిస్థితులన్నీ బాగుండి.. ఎలాంటి కరోనా భయాలు లేనప్పుడు తన సినిమా గనుక థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా..
ఓటీటీలో వస్తే ఆరోజున ఎవరో వచ్చి తనను బ్యాన్ చేయక్కర్లేదని.. తనను తనే బ్యాన్ చేసుకుంటానని తెలిపాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఎగ్జిబిటర్లపై తనకు చాలా గౌరవం ఉందని.. వాళ్లు ఉన్న పరిస్థితుల్లో తనను ఎదో అన్నారని.. అందులో తప్పు లేదని అన్నాడు. వాళ్లపై తనకు చాలా సానుభూతి ఉందని.. కాకపోతే తను కూడా వాళ్లలో ఒకడ్ని అని.. ఆ కాసేపు తనను బయటోడ్ని చేసేశారనే బాధ ఉందని..
తను కూడా వాళ్లలో ఒకడ్ని అనే విషయాన్ని గుర్తిస్తే చాలని తన ఆవేదన వ్యక్తం చేశాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ‘టక్ జగదీష్’ సినిమా సెప్టెంబర్ 10న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!