బడా హీరోలే టార్గెట్ గా నాని!!!

  • September 23, 2016 / 10:57 AM IST

టాలీవుడ్ లో బడా హీరోలు….చిన్న హీరోలు అన్న వ్యత్యాసం ఉంది. అయితే అదే క్రమంలో ఎవరి రేంజ్ వారిది…ఎవరి స్టామిన వారిది….కొందరు బడా హీరోలు అయినప్పటికీ భారీ ఫ్లాప్స్ ఇచ్చిన సంధర్భాలు ఎన్నో…మరి కొందరు చిన్న హీరోలు అని అనుకున్నప్పటికీ వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన సమయాలు చాలానే ఉన్నాయి…ఇదిలా ఉంటే వార్సా హిట్స్ తో దాదాపుగా ఈ ఏడాది ఇంకో సినిమా హిట్ ఇచ్చి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలి అని చూస్తున్న న్యాచురల్ స్టార్ నాని….

తన కొత్త సినిమా ‘మజ్ను’ ప్రమోషన్ లో భాగంగా  హీరోల ఇమేజ్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు…అసలు ఆని ఏమన్నాడు అంటే….ప్రస్తుతం టాలీవుడ్ లో ‘స్టార్’ అనే పదానికి అర్థం మారుతోంది అని అంటూ భవిష్యత్ లో హీరోలు స్టార్స్ కారని కథలు మాత్రమే స్టార్స్ కాబోతున్నాయని అంటూ హీరోలకన్నా సినిమాకు కధే ఇంపార్టెంట్ అన్న ఫీల్ ను తెలిపాడు…ఇక స్టార్స్ అన్న పదం పై కాస్త ఘాటుగా…తాను స్టార్ కాదని అంటూ తాను ఏ స్టార్ లీగ్ కూ చెందను  అంటూ టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇమేజ్ పై ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు.

ఇక సినిమాల రికార్డులు..కలెక్షన్స్ గురించి సైతం నాని తనదైన శైలిలో స్టార్ హీరోలకు చురకాలు అంటించాడు…సినిమాల కలక్షన్ రికార్డ్స్ తన సినిమాల వసూళ్ల గురించి బిజినెస్ గురించి తాను పెద్దగా పట్టించుకోను అని, ఎంతసేపు….నా సినిమా…నా పాత్ర అన్న దాని గురించే ఆలోచించుకుంటాను తప్పా….మరేమీ కాదు అని తెలిపాడు….ఇలా తనదైన స్టైల్ లో నాని టాలీవుడ్ టాప్ ఇమేజ్ ఉన్న హీరోలను ఒక రౌండ్ వేసుకోవడం విశేషం…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus