Nani: మరో ఆలోచన లేకుండా ఓకే చేస్తా..!

  • May 7, 2021 / 06:56 PM IST

బాలీవుడ్ లో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. సౌత్ సెలబ్రిటీలు చాలా మంది బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ ఎవరూ సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయారు. హీరో నానికి కూడా బాలీవుడ్ కు వెళ్లాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు. బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ కొన్ని సమస్యలను చెప్పుకొచ్చారు. మంచి బాలీవుడ్ ప్రాజెక్ట్ తగిలితే కచ్చితంగా నటిస్తానని.. ఫిలిం మేకర్ లేదా కథ దొరికితే చేయాలా వద్దా అని ఆలోచించనని..

ఎందుకంటే అది బాలీవుడ్ సినిమా కాబట్టి అని చెప్పిన నాని.. కాకపోతే ఒకటే సమస్య అన్నారు. అదేంటంటే.. నటించేప్పుడు భాష అడ్డురాకూడదని.. తనకు హిందీ వచ్చినప్పటికీ.. సినిమాలో ఓ పాత్ర పోషించడానికి అది సరిపోదని అన్నారు. కాబట్టి తన దగ్గరకు వచ్చే కథ ఎలా ఉండాలంటే.. ఆ పాత్ర కోసం కష్టపడి హిందీపై పట్టు సాధించాలని అనిపించాలని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ప్రేక్షకులకు తను కొత్త అనే ఫీలింగ్ రాకూడదని..

ఆ రేంజ్ లో తనను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ దొరికితే బాలీవుడ్ లో నటించడానికి రెడీ అని అన్నారు. గతేడాది నాని నటించిన ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో నటిస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus