వైరల్ అవుతున్న హీరో నిఖిల్ పెళ్లి ఫోటోలు!

  • May 14, 2020 / 10:59 AM IST

త‌ర త‌రాల శ‌క్తినీ, సార్వ‌భౌమాధికారాన్ని, గౌర‌వాన్ని, య‌థాత‌థంగా నిలుపుతామ‌నే ప్ర‌మాణ‌మే వివాహం.. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో పెళ్ళి గ‌డియలు వ‌స్తాయి. ఆ గ‌డియలు వ‌చ్చినప్పుడు జ‌ర‌గాల్సిందే. స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, కార్తికేయ‌, ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ‌, అర్జున్ సుర‌వ‌రం లాంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ కి పెళ్లి గ‌డియలు రానే వ‌చ్చాయి.. డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ తో నిశ్చితార్థం అయ్యిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 16న పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న విష‌యం తెలిసిందే.

అయితే ప్ర‌పంచం మెత్తాన్ని క‌రొనా మ‌హ‌మ్మారి వ్యాపించి ఎక్క‌డి వారిని అక్క‌డే వుండేలా మ‌నుషుల మ‌ద్య దూరం వుండేలా చేసింది. ఈ ప‌రిస్థితిలో నిఖిల్ పెళ్ళి వాయిదా వేసుకున్నారు. అయితే క‌ళ్యాణం వ‌చ్చినా కక్కు వ‌చ్చినా ఆగ‌దు అనే పెద్ద‌ల సామెత నిజ‌మ‌వుతుంది. లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం.. ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల‌న వదువరులు ఇద్ద‌రి జాత‌కాల రీత్యా ఈరోజు ఉదయం 6:31 ని”లకు పెళ్ళి నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంభందించిన ఫోటోస్‌, వీడియోస్ మాత్రం ఫ్యాన్స్ కి సోష‌ల్ మీడియా ద్వారా అందిస్తున్నారు. ఈ నూత‌న‌వ‌ధువ‌రుల‌ను ఎక్క‌డి వారు అక్క‌డే వుండి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నారు. దంపతులకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus