Nikhil: నిఖిల్ సినిమాను లైట్ తీసుకున్నారా?

  • June 8, 2022 / 01:00 PM IST

యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న ‘స్పై’ సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు. దీనికంటే ముందు ‘కార్తికేయ2′ థీమ్ మోషన్ పోస్టర్ ను వదిలారు. అంతకముందు ’18 పేజెస్’ సినిమా హంగామా నడిచింది. ఇలా నిఖిల్ అప్ కమింగ్ సినిమాల గురించి టాపిక్ వచ్చిన ప్రతీసారి ఈ మూడు సినిమాల గురించి చర్చ జరుగుతోంది. కానీ ఇదే లిస్ట్ లో మరో సినిమా కూడా ఉంది. దాని షూటింగ్ కూడా పూర్తయింది.

అయితే దాని గురించి మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. నిఖిల్ కూడా చెప్పడం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఈ సినిమా గురించి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అలా అని ఇదేమైనా చిన్న సినిమానా అంటే అదీ కాదు.

ఇంతకముందు నిఖిల్-సుధీర్ వర్మ కలిసి ‘స్వామిరారా’ లాంటి హిట్ సినిమా తీశారు. ఆ తరువాత వీరిద్దరి కాంబోలో ‘కేశవ’ సినిమా వచ్చింది. ఈ రివెంజ్ డ్రామా ఏవరేజ్ గా ఆడింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేశారు. దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ నిర్మించారు. ఈ సినిమాపై బాగా ఖర్చు పెట్టారు. విదేశాల్లో కూడా షూటింగ్ నిర్వహించారు.

అలాంటి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కూడా రాలేదు. టైటిల్ కూడా చెప్పలేదు. మరోపక్క సుధీర్ వర్మ, నిర్మాత బీవీఎస్ఎన్ వేరే సినిమాలపై ఫోకస్ పెట్టారు. మరి నిఖిల్ సినిమాను ఎందుకు వదిలేశారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus