Nikhil: అభిమానికి కళ్ళజోడు బహుమతిగా ఇచ్చిన నిఖిల్.. జాగ్రత్త బ్రో అంటూ పోస్ట్!

  • June 27, 2022 / 10:19 AM IST

సాధారణంగా ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమా కోసం కష్టపడి పనిచేసిన దర్శకుడికి హీరో హీరోయిన్లకు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం అయింది. ఈ మధ్య కాలంలో ఇలా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా హిట్ అవ్వడం కమల్ హాసన్ దర్శకుడికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.అలాగే హీరో సూర్యకు రోలెక్స్ వాచ్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా ఖరీదైన బైక్స్ గిఫ్ట్ ఇచ్చారు.

ఈ ఘటన మరిచిపోకముందే బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తీక్ ఆర్యన్ కు ఏకంగా నాలుగు కోట్ల ఖరీదు చేసే విలువైన కారణం బహుమతిగా ఇచ్చారు. కార్తీక్ ఆర్య నటించిన సినిమా హిట్ అవ్వడంతోనే నిర్మాత తనకు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సైతం తన అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా నటించిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 తెరకెక్కింది. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ పాత్రలో నటించారు. షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 22 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ వేడుకలో నిఖిల్ అభిమాని మహేష్ అనే వ్యక్తి తాను హీరో నిఖిల్ కి పెద్ద అభిమానిని ఇప్పటివరకు నిఖిల్ నటించిన ప్రతి ఒక్క సినిమాని మిస్ కాకుండా చూస్తున్నానని నిఖిల్ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టారు.

ఈ క్రమంలోనే నిఖిల్ తన అభిమానిని వేదికపైకి పిలిచి తనకు కళ్ళజోడు బహుమానంగా ఇచ్చారు.ఇక నిఖిల్ తనకు కళ్ళజోడు ఇచ్చిన విషయాన్ని మహేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఈ విషయంపై స్పందించిన నిఖిల్ బ్రో మీరు నాపై చూపించిన ప్రేమకు గుర్తుగా ఇచ్చిన బహుమానం కళ్లజోడును జాగ్రత్తగా చూసుకోండి అంటూ తెలియజేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus