ప్రేమ పేరుతో కడుపు చేసి వదిలేశాడు.. యంగ్ హీరో పై నటి పోలీస్ కంప్లైంట్..!

  • October 12, 2022 / 06:18 PM IST

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అని అంతా అనుకుంటారు. ఈ పరిశ్రమలో ఉన్న వారికి ఎటువంటి కొదువ ఉండదు అని కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పైకి చెప్పుకోలేని కష్టాలు ఎన్నో ఉంటాయని.. అవి పైకి చెప్పుకోలేనివిగా ఉంటాయని, ఒక్కసారి వాటిని జయించి నిలబడితే గనుక మంచి ఫలితాలను అందుకోవచ్చని చాలా మంది పెద్దలు అంటుంటారు. అంతేకాదు ఇక్కడ అవకాశాల కోసం వచ్చే వారిని పురుగుల కంటే హీనంగా చూసేవారట అప్పట్లో..! అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు అని చెప్పలేం కానీ తగ్గింది అని అయితే కచ్చితంగా చెప్పొచ్చు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కి ఇక్కడ అవకాశాలు లభిస్తున్నాయి. అయితే పెద్దగా చదువుకోని వాళ్ళు నిజానిజాలను గుర్తించలేక ఇంకా మోసపోతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం చేసి చేతులు దులుపుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు ఓ యంగ్ హీరో. వివరాల్లోకి వెళితే… యామినీ భాస్కర్ హీరోయిన్ గా నటించిన ‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ప్రియాంత్ రావుకి కొన్నాళ్ల క్రితం ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడిందట.

రెండు నెలలకే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఈ జూనియర్ ఆర్టిస్ట్ ను ఆ యంగ్ హీరో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ప్రగతి రిసార్ట్ కి తీసుకెళ్లి.. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అత్యాచారం చేశాడు. అంతేకాదు శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ఆఫీస్ కి తీసుకెళ్లి మరికొన్ని సార్లు ముచ్చట తీర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో అబార్షన్ కోసం మెడిసిన్స్ ఇచ్చి కొన్నాళ్ళు ఆగమని చెప్పాడట.

అయినా ఆమె మారం చేయడంతో ‘ఈ విషయం బయట చెప్తే నిన్ను చంపేస్తా’ అని హెచ్చరించాడట. దీంతో ఆమె ప్రియాంత్ రావు పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందట.బాధితురాలి ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus