Rajasekhar: హీరో రాజశేఖర్ అలా చేస్తే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న రాజశేఖర్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ నటిస్తుండగా జీవిత, జీవితం అంటూ ట్రైలర్ లో రాజశేఖర్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. ఒకప్పుడు రాజశేఖర్ టైమ్ కు సెట్స్ కు రారనే అపవాదు ఉండేది.

అయితే నితిన్ సినిమాకు మాత్రం చెప్పిన సమయం కంటే ముందుగానే ఆయన షూటింగ్ కు హాజరయ్యారట. సెకండ్ ఇన్నింగ్స్ లో క్రూరమైన విలన్ రోల్స్ ను రాజశేఖర్ ఎంచుకుంటే మాత్రం ఆయన కెరీర్ కు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీని విలన్ల కొరత వేధిస్తోంది. జగపతిబాబు, శ్రీకాంత్ ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా రాజశేఖర్ కూడా ఆ నటుల దారిలో అడుగులు వేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజశేఖర్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది. శివాని రాజశేఖర్ కూడా కోటబొమ్మాళి పీఎస్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రామబాణం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల రాజశేఖర్ ఆ సినిమాను వదులుకున్నారు. మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రాజశేఖర్ కు (Rajasekhar) కెరీర్ పరంగా తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. వక్కంతం వంశీ కెరీర్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus