Jr NTR,Rajasekhar: ఎన్టీఆర్ సినిమాలో రాజశేఖర్ పవర్ఫుల్ రోల్?

ఇటీవల కాలంలో కొంతమంది సీనియర్ హీరోలు నేటి తరం యువ హీరోలతో కూడా ప్రత్యేకమైన పాత్రలతో కనిపిస్తూ సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మల్టీ స్టారర్ సినిమా చేయడానికి కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. అయితే పాత్ర నచ్చితే మాత్రం కొంతమంది పారితోషికాన్ని కూడా లెక్కచేయకుండా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే ఎన్టీఆర్ రాజశేఖర్ ఇద్దరు కూడా సింగిల్ ఫ్రేమ్ లో కనిపించే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే కొనసాగుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ జూనియర్ ఎన్టీఆర్ కు పెదనాన్న పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా లో దర్శకుడు కొరటాల శివ హీరో బాబాయి పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇంకా రాజశేఖర్ను ప్రత్యేకంగా కలిసి కథ గురించి చెప్పలేదట. కేవలం చిత్రయూనిట్ సభ్యులు మాత్రమే ఆ పాత్ర కోసం చర్చలు జరుగుపున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న పేరు రాజశేఖర్ అని తెలుస్తోంది. గత కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న రాజశేఖర్ ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలి అని అనుకుంటున్నాడు. స్టార్ హీరోలతో ప్రత్యేకమైన పాత్రలో నటించడానికి కూడా తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని గతంలోనే ఈ సీనియర్ హీరో ఒక క్లారిటీ ఇచ్చాడు.

యాంగ్రీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న రాజశేఖర్ తో మంచి పవర్ఫుల్ పాత్రలో కూడా చేయించవచ్చు అని చెప్పవచ్చు. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్ర కోసం మొదటి ఆప్షన్ గా రాజశేఖర్ అనుకున్నట్లుగా టాక్ కూడా వచ్చింది. మరి జూనియర్ ఎన్టీఆర్ తో రాజశేఖర్ నటించే అవకాశం ఉందా లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus