స్టార్ హీరోలు తమ సినిమా నెంబర్ విషయంలో ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. ముఖ్యంగా మైల్‌స్టోన్ సినిమాలకు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అలాంటి ప్రత్యేకతను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram) షేర్ చేసుకుంటున్నారు. ఇద్దరూ తమ తమ 22వ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుతం రామ్ నటిస్తున్న సినిమా మహేష్ బాబు పి (Mahesh Babu P) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే కొన్ని పార్ట్‌ల షూటింగ్ పూర్తి కాగా, మిగిలిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇది ఆయన కెరీర్‌లో 22వ చిత్రం కావడం మరో ప్రత్యేకత. ఇదే సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో తన 22వ సినిమాకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 (Pushpa 2) సక్సెస్ తర్వాత బన్నీ తీసుకుంటున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగా, జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆర్‌ఏపీఓ (రామ్) 22వ చిత్రం, బన్నీ 22వ చిత్రం ఒకే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ప్రత్యేకించి బన్నీ సినిమా నెంబర్ హైప్ కారణంగా రామ్ సినిమా నెంబర్‌కు కూడా అదనపు క్రేజ్ వస్తోంది.
ఫ్యాన్స్ ఈ సరైన యాదృచ్ఛికాన్ని పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు. సాధారణంగా ఇలా ఒకే నెంబర్‌తో స్టార్ హీరోలు సినిమాలు రావడం అరుదు. పైగా ఇద్దరూ తమ తమ కెరీర్‌లో కీలకమైన మైల్స్‌స్టోన్ స్టేజ్‌లో ఉన్నారు. ఈ కాంబినేషన్ టాలీవుడ్‌లో కొత్త చర్చలు తెరపైకి తెస్తోంది. మరి ఇద్దరూ తమ 22వ సినిమాలతో ఎలా మెప్పిస్తారో చూడాలి.