Ram Pothineni: నిరాశలో రామ్ ఫ్యాన్స్.. కారణమేంటంటే..?

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ ఫ్లాపులకు అతీతంగా రామ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఈ ఏడాది రెడ్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ 1988 సంవత్సరం మే 15వ తేదీన జన్మించారు. నేడు రామ్ పోతినేని పుట్టినరోజు. అయితే దేవదాసు సినిమాతోనే రామ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైనప్పటికీ సినిమాల్లోకి రాకముందే రామ్ తమిళంలో అడయాళం అనే షార్ట్ ఫిలింలో నటించారు.

2002లో విడుదలైన ఈ షార్ట్ ఫిలింతో నటుడిగా రామ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన దేవదాస్ సినిమాతో హిట్ అందుకున్నారు. తొలి సినిమా హిట్ తరువాత ఆచితూచి కథలను ఎంచుకున్న రామ్ రెడీ, మస్కా సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. 2016లో విడుదలైన నేను శైలజ సినిమాతో రామ్ మరో బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకున్నారు. నేను శైలజ సినిమా తరువాత రామ్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించారు. అయితే రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ భావించారు. అయితే కరోనా వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో రామ్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ లేనట్టేనని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి రామ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus