Sai Dharam Tej About Marriage: ఆ వార్తల విషయంలో స్పష్టత ఇచ్చిన సాయితేజ్ టీం.. అసలేమైందంటే?

  • July 26, 2024 / 04:30 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో సాయితేజ్ (Sai Dharam Tej) ఒకరు కాగా విరూపాక్ష (Virupaksha) సినిమాతో సాయితేజ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సాయితేజ్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా సాయితేజ్ సినిమాల బడ్జెట్ భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. అయితే ఈ మధ్య కాలంలో సాయితేజ్ పెళ్లి గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. సాయితేజ్ ఇప్పటికే కలిసి నటించిన హీరోయిన్లతో లింక్ చేస్తూ ఈ హీరో పెళ్లి వార్తలను ప్రచారం చేస్తున్నారు.

అయితే మెహ్రీన్ తో (Mehreen Pirzada) సాయితేజ్ పెళ్లి అంటూ ఈ మధ్య కాలంలో వార్తలు వినిపించగా ఆ వార్తల గురించి సాయితేజ్ టీం క్లారిటీ ఇచ్చింది. సాయితేజ్ పెళ్లికి సంబంధించి జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని సాయితేజ్ పెళ్లికి సంబంధించి ఏదైనా విషయం ఉంటే అధికారికంగా ప్రకటమిస్తామని టీం సభ్యులు పేర్కొన్నారు. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయవద్దని టీం కోరింది.

జవాన్ సినిమాలో సాయితేజ్, మెహ్రీన్ కలిసి నటించగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సాయితేజ్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న సాయితేజ్ తన నటనతో ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయితేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

కథ అద్భుతంగా ఉంటే కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి సైతం సాయితేజ్ ముందువరసలో ఉంటారు. సాయితేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు సాయితేజ్ కోరుకున్న భారీ హిట్ అందిస్తాయేమో చూడాలి. సాయితేజ్ తర్వాత మూవీ 120 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సాయితేజ్ నవ్యత ఉన్న కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus