టాలీవుడ్ హీరో శర్వానంద్ మరికొద్ది రోజులలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. రక్షిత రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు. ఇలా శర్వానంద్ రక్షిత నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కూడా మనకు తెలిసిందే.
ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మనవరాలే రక్షిత రెడ్డి. అలాగే ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ పరంగా భారీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఈమె తండ్రి భారీగా ఆస్తులు కూడ పెట్టినట్టు సమాచారం. అదేవిధంగా తన తాతల కాలంనాటి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయని వీరికి వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక రక్షిత ఇంజనీర్ గా పని చేస్తూ ఈమె కూడా భారీగానే ఆస్తులు సంపాదించారట రక్షిత పేరు మీదనే వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఈ విధంగా శర్వానంద్ ఆలస్యంగా పెళ్లి చేసుకున్న భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం వేసవిలో జరగబోతున్నట్టు సమాచారం.