Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Reviews » Pathaan Review In Telugu: పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pathaan Review In Telugu: పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 25, 2023 / 03:03 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Pathaan Review In Telugu: పఠాన్  సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • షారుఖ్ ఖాన్ (Hero)
  • దీపికా పదుకొనే (Heroine)
  • జాన్ అబ్రహం ,అశుతోష్ రాణా , గౌతమ్ రోడ్, డింపుల్ కపాడియా (Cast)
  • సిద్ధార్థ్ ఆనంద్ (Director)
  • ఆదిత్య చోప్రా (Producer)
  • విశాల్–శేఖర్ (Music)
  • సచ్చిత్ పాలోస్ (Cinematography)
  • Release Date : 2023 జనవరి 25
  • యష్ రాజ్ ఫిల్మ్స్ (Banner)

2018లో వచ్చిన “జీరో” తర్వాత నాలుగేళ్ల విరామం అనంతరం షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “పఠాన్”. “వార్” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ & పాటలు భారీ అంచనాలను నెలకొల్పాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? 2013 నుంచి సరైన హిట్ లేక ఢీలాపడిన షారుక్ ఖాన్ కు ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ హిట్ దొరికిందా లేదా? అనేది చూద్దాం..!!

కథ: భారతదేశంపై భారీ దాడి ప్లాన్ చేసిన ఔట్ ఫిట్ ఎక్స్ అనే గ్యాంగ్ కి లీడర్ జిమ్ (జాన్ అబ్రహాం). డైరెక్ట్ ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ “రా”ను బెదిరిస్తాడు. దాంతో.. కొంతకాలంగా అజ్ణాతంలో ఉన్న పఠాన్ (షారుక్ ఖాన్)కు కబురు పెడుతుంది రా. జిమ్ & గ్యాంగ్ ను ఎదుర్కోవడానికి పఠాన్ ఎలాంటి రిస్క్ చేశాడు? దాడిని తప్పించడానికి ఎవరి సహాయం తీసుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పఠాన్” చిత్రం.

నటీనటుల పనితీరు: షారుక్ ఖాన్ దాదాపు 10 ఏళ్ళ తర్వాత తన బెస్ట్ లుక్ లో కనిపించారు. నటుడిగా ఆయన ఏస్థాయిలో ఆకట్టుకుంటారు అనే విషయాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేయనక్కర్లేదు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ & కామెడీ టైమింగ్ ను ఆడియన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే.. యాక్షన్ సీన్స్ లో షారుక్ ప్రెజన్స్ ఫ్యాన్స్ కి పండగే.

దీపిక పడుకొనే లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఆమె సెక్స్ అప్పీల్ & సాంగ్స్ లో డ్యాన్సులు మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ లాంటివి. నెగిటివ్ రోల్లో జాన్ అబ్రహాం అదరగొట్టాడు. అశుతోష్ రాణా, డింపుల్ కపాడియాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: చిత్రబృందంలో అత్యధిక స్కోర్ సాధించిన టెక్నీషియన్ కెమెరామెన్ సత్చిత్ పౌలోస్. సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం పలు హాలీవుడ్ చిత్రాలను గుర్తుకు తెచ్చినప్పటికీ.. సదరు సన్నివేశాలను, యాక్షన్ బ్లాక్స్ ను ఇండియనైజ్ చేసిన విధానం బాగుంది. సంచిత్ – అంకిత్ ద్వయం సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. అదే రీతిలో నేపధ్య సంగీతం కూడా అదిరింది. హీరోయిజాన్ని, యాక్షన్ బ్లాక్స్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసిన తీరు విశేషంగా మెప్పిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ టాప్ క్లాస్ గా ఉన్నాయి.

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నుంచి సగటు ప్రేక్షకులెవరూ అద్భుతమైన కథ ఆశించరు. ఆ విషయం అతడికి కూడా తెలుసు.. అందుకే కథను గాలికొదిలేసి, యాక్షన్ బ్లాక్స్ & ఎలివేషన్ సీన్స్ తో నెట్టుకొచ్చేస్తుంటాడు. “పఠాన్” విషయంలోనూ అదే చేశాడు. యాక్షన్ సీన్స్ అన్నీ జేమ్స్ బాండ్ & ఫాస్ట్ సిరీస్ సినిమాల నుంచి లేపేసిన సిద్ధార్థ్, కనీసం సదరు సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం మార్చినా బాగుండేది.

ఇంతటి భారీ స్టార్ క్యాస్టింగ్, బడ్జెట్, వి.ఎఫ్.ఎక్స్, యాక్షన్ బ్లాక్స్ & సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ ఉన్నందుకు.. కనీస స్థాయి ఎమోషన్ ఉండి ఉంటే బాలీవుడ్ రికార్డ్స్ అన్నీ తారుమారయ్యేవి. సో, దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టినా, కథకుడిగా విఫలమయ్యాడు సిద్ధార్థ్.

విశ్లేషణ: కథను పట్టించుకోకుండా, షారుక్ స్క్రీన్ ప్రెజన్స్ & యాక్షన్ బ్లాక్స్ ను ఎంజాయ్ చేస్తూ.. చివర్లో వచ్చే సల్మాన్ ఎంట్రీని ఆస్వాదించగలిగితే.. “పఠాన్”ను బాగా ఎంజాయ్ చేస్తారు. హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తూ, కథకు ప్రాధాన్యత ఇచ్చే జనాలకు మాత్రం ఎబౌ యావరేజ్ సినిమా అనిపిస్తుంది.

;

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #John Abraham
  • #Pathaan
  • #Shah Rukh Khan
  • #Siddharth Anand

Reviews

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా  రివ్యూ & రేటింగ్!

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా రివ్యూ & రేటింగ్!

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

Andhra King Taluka Review In Telugu: “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా రివ్యూ!

related news

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Ranveer and Deepika: ఈ స్టార్‌ కపుల్‌ ప్రేమ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

Ranveer and Deepika: ఈ స్టార్‌ కపుల్‌ ప్రేమ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

13 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

14 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

15 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

15 hours ago

latest news

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

15 hours ago
Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

16 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

18 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

20 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version