Hunt Review In Telugu: హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
January 26, 2023 / 02:29 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
సుధీర్‌బాబు (Hero)
-- (Heroine)
శ్రీకాంత్ , భరత్ (Cast)
మహేశ్ సూరపనేని (Director)
వి. ఆనంద ప్రసాద్ (Producer)
జిబ్రాన్ (Music)
అరుల్ విన్సెంట్ (Cinematography)
Release Date : 2023 జనవరి 26
సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “హంట్”. మలయాళంలో పృధ్వీరాజ్ సుకుమారన్ నటించగా 2013లో విడుదలైన “ముంబై పోలీస్”కు అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం నేడు (జనవరి 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మలయాళ రీమేక్ మన ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: అసిస్టెంట్ కమీషనర్ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు), తన స్నేహితుడు ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) హత్య కేసును డీల్ చేస్తుంటాడు. సరిగ్గా హంతకుడు ఎవరో తెలిసి.. తన స్నేహితుడు & కమిషనర్ మోహన్ భార్గవ్ (శ్రీకాంత్)కు చెబుతున్న సమయంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోతాడు.
దాంతో ఆర్యన్ హత్య కేసు మళ్ళీ మొదటికొస్తుంది. గతం మర్చిపోయిన అర్జున్ ఈ కేస్ ను ఎలా డీల్ చేశాడు? అసలు ఆర్యన్ ను హత్య చేసింది ఎవరు? అందుకు గల కారణం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “హంట్” చిత్రం.
నటీనటుల పనితీరు: ఫైట్స్, డ్యాన్స్ వరకు పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ కి వచ్చే సరికి సుధీర్ బాబు ప్రతి సినిమాలోనూ దొరికిపోతుంటాడు. ఈ చిత్రంలోనూ అదే జరిగింది. తన మీద తాను అసహ్యపడే సన్నివేశంలో కూడా ఆ ఎమోషన్ ను తన నటన ద్వారా ఎలివేట్ చేయలేకపోయాడు. సినిమాకి చాలా కీలకమైన జస్టిఫికేషన్ ఇచ్చే సన్నివేశమది, అందులోనూ తేలిపోవడంతో..
సుధీర్ బాబు పాత్ర ఎవరికీ కనెక్ట్ అవ్వలేకపోయింది. “ప్రేమిస్తే” ఫేమ్ భరత్, శ్రీకాంత్ లు పోలీస్ కమ్ ఫ్రెండ్స్ గా ఆకట్టుకున్నారు. లేడీ పోలీస్ గా మౌనిక రెడ్డి అలరించింది.
సాంకేతికవర్గం పనితీరు: అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమా మొత్తానికి చెప్పుకోదగ్గ పాజిటివ్ పాయింట్. ఇచ్చిన బడ్జెట్ లో చక్కని అవుట్ పుట్ ఇచ్చాడు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించాడంటే నమ్మడం కష్టం. మామూలుగా అత్యంత సాధారణ సన్నివేశాలను కూడా తన నేపధ్య సంగీతంతో అసాధారణంగా ఎలివేట్ చేసే జిబ్రాన్ మార్క్ ఈ చిత్రంలో ఏ కోశాన కనిపించలేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ సోసోగా ఉంది. చాలా సన్నివేశాలకు ఆర్ట్ వర్క్ కుదరలేదు. అలాగే కంటిన్యుటీ మిస్ అయ్యింది.
దర్శకుడు మహేష్ సూరపనేని.. మలయాళ మాతృకను, యాక్షన్ బ్లాక్స్ మినహా కథలో కానీ కథనంలో కానీ ఎలాంటి మార్పులు చేయకుండా తెరకెక్కించడం పెద్ద మైనస్. ఎప్పుడో పదేళ్ళ క్రితం యావరేజ్ గా నిలిచిన ఒక కాన్సెప్ట్ ను ఎలాంటి మార్పులు చేయకుండా 2023లో విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కాలేదు. కానీ… ఒక దర్శకుడిగా మారిన ఆడియన్స్ మైండ్ సెట్ ను, సినిమా చూసే విధానాన్ని ఎనలైజ్ చేయకుండా ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయడం అనేది మహేష్ సూరపనేని పనితనానికి ప్రతీకగా నిలుస్తుంది.
విశ్లేషణ: మిస్టరీ థ్రిల్లర్స్ ను డీల్ చేసే విధానం ఎప్పటికప్పుడు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా మారుతూ ఉండాలి. “అవే కళ్ళు” చిత్రాన్ని ఇప్పుడు అదే తరహా టేకింగ్ తో తీసే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు. ఈ విషయాన్ని గుర్తించకో లేక పట్టించుకోకనో “హంట్” ఆడియన్స్ ను ఎం”గే”జ్ చేయలేకపోయింది.