Srikanth Family: మెహందీ ఫంక్షన్లో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

సీనియర్ హీరో శ్రీకాంత్ అందరికీ సుపరిచితమే. నెగిటివ్ రోల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన శ్రీకాంత్.. తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. శ్రీకాంత్ వల్ల టాలీవుడ్లో పాపులర్ డైరెక్టర్స్ గా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉంటారు శ్రీకాంత్. ఏ ప్రాజెక్టు లేకపోతే వెబ్ సిరీస్ వంటి వాటిలో కూడా నటిస్తూ ఉంటారు. ‘అఖండ’ తో పవర్ ఫుల్ విలన్ గా మారిన శ్రీకాంత్..

మరోపక్క ‘వారసుడు’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే.. మరోపక్క పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కూడా భాగం అవుతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో ఓ టిపికల్ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ తన ఫ్యామిలీని మీడియాకి చాలా వరకు దూరంగా ఉంచుతాడు. గతంలో (Srikanth )శ్రీకాంత్ … హీరోయిన్ ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వీళ్లకు ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి రోషన్ ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓ హిట్ కొట్టాడు. అతను అందరికీ తెలుసు. అలాగే వీరి అమ్మాయి మేదా, అలాగే చిన్నబ్బాయి రోహన్. కలర్ జిరాక్స్ కి బెస్ట్ ఎగ్జామ్పుల్ అని ఈ ఫ్యామిలీ గురించి చెబుతూ ఉంటారు. తాజాగా శ్రీకాంత్ ఫ్యామిలీ తమ సన్నిహితుల ఇంట్లో జరిగిన మెహందీ ఫంక్షన్లో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus