Srikanth, Ooha: భార్య ఊహతో కలిసి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్న శ్రీకాంత్.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ మధ్య కాలంలో ఎందుకో కానీ.. శ్రీకాంత్ మరియు అతని భార్య ఊహ.. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా తీర్థయాత్రలు పూజలు వంటి వాటిలో పాల్గొంటున్నారు. గత నెలలో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చారు శ్రీకాంత్ దంపతులు. అంతేకాదు అంతకు.. ఆయన ఇంట్లో రుద్రాభిషేకంను కూడా నిర్వహించారు. నవంబర్ 7న సోమవారం నాడు శ్రీకాంత్,ఉమా మహేశ్వరి ( ఊహ గారు) దంపతులు ఫిలింనగర్ లో ఉన్న తమ నివాసంలో ఈ ప్రత్యేక పూజను నిర్వహించినట్లు తెలుస్తోంది.

కార్తీక మాసంలో 13వ రోజు శ్రీ కపర్దీశ్వర స్వామి వారి మహా రుద్రాభిషేకం శ్రీ కపర్దీశ్వర పీఠం ఆధ్వర్యంలో అత్యంత విశేషంగా, ఎంతో వైభవోపేతంగా ఈ పూజ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొన్నామధ్య శ్రీకాంత్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినట్టు, అలాగే శ్రీకాంత్- ఊహ విడాకులు తీసుకోబోతున్నట్లు.. చాలా నెగిటివ్ న్యూస్ లు వచ్చాయి. వీటి పై శ్రీకాంత్ స్పందించి తీవ్రంగా ఖండించాడు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీకాంత్ మరియు ఊహ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరగడం.. ఆమె కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారని. శ్రీకాంత్ అత్తగారి ఇంట్లోని సభ్యులు కూడా ఫోన్లు చేసి.. ఏమి లేకుండా ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయని ఆరాతీసినట్టు కూడా శ్రీకాంత్ తెలిపారు. ఇది ఎవరో శ్రీకాంత్ అంటే పడని వాళ్ళు చేయిస్తున్నట్టు అంతా అభిప్రాయపడ్డారు.తన సినిమాలు తాను చేసుకోవడం తప్ప శ్రీకాంత్ వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒక్క మా అసోసియేషన్ విషయంలో మాత్రమే శ్రీకాంత్ విమర్శలపాలయ్యాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus