ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కి సినిమాలు బాలీవుడ్ సినిమాలను శాసిస్తున్నాయని చెప్పాలి.భారతీయ సినిమా అంటేనే బాలీవుడ్ సినిమాలుగా చెప్పుకునేవారు. ప్రస్తుతం దక్షిణాది సినిమాలను భారతీయ సినిమాలుగా చెప్పుకునే స్థాయికి చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది.ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలు నార్త్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడంతో నార్త్ సౌత్ అంటూ విభేదాలు మొదలయ్యాయి. ఇకపోతే గతంలో కన్నడ నటుడు సుదీప్ జాతీయ భాష హిందీ కాదంటూ చేసిన కామెంట్స్ ఎలాంటి వివాదాలకు కారణం అయ్యాయో మనకు తెలిసిందే.
ఈ విషయంపై నటుడు అజయ్ దేవగన్, సుదీప్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఈ వివాదం ముగిసింది అనుకొనే లోపు మరోసారి ఈయన బాలీవుడ్ సినిమాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలోని ఈయన హిందుస్థాన్ టైంకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ కంటెంట్ ఉన్న సినిమాలు ఏ భాషలో అయినా కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి.
సినిమాలకు భాషతో పనిలేదని సినిమా కొత్తగా ఉంటే ప్రతి ఒక్కరూ అలాంటి సినిమాలను ఆదరిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సాంస్కృతిక భేదం అనేది ఉండదు ఎప్పుడు చూడని కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తే తప్పనిసరిగా ఆ సినిమాని ఆదరిస్తారు. ప్రస్తుతం ఎన్నో సౌత్ సినిమాలు నార్త్ ఇండస్ట్రీలో థియేటర్లలో విడుదలవుతున్నాయి ఒకప్పుడు కేవలం టీవీలలో మాత్రమే ఈ సినిమాలు థియేటర్లో విడుదల ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి.
ప్రతిదానికి ఓ ముగింపు ఉంటుంది అంటూ బాలీవుడ్ సినిమాల ఆధిపత్యం గురించి ఈయన పరోక్షంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా చిత్ర పరిశ్రమలో గత 15 సంవత్సరాల నుంచి జరగని మార్పులు ఈ రెండు సంవత్సరాలలో జరిగాయి అంటూ సుదీప్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!