హీరో సుహాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

తక్కువ సినిమాలే చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో సుహాస్ ఒకరు. రైటర్ పద్మభూషణ్ సినిమాతో సుహాస్ ఖాతాలో మరో సక్సెస్ చేరిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తో సుహాస్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగింది. ఒక్కో సినిమాకు సుహాస్ ప్రస్తుతం కోటిన్నర రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
సుహాస్ గత సినిమా పారితోషికంతో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సుహాస్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు తన నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ అయినా సుహాస్ అద్భుతంగా ఇస్తాడని తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడని పేరు రావడంతో సుహాస్ కు సినిమా ఇండస్ట్రీలో వరుసగా మూవీ ఆఫర్లు వస్తున్నాయి. సుహాస్ భిన్నమైన కథలకు ఓటేయడంతో పాటు ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుహాస్ కెరీర్ ప్లానింగ్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

వరుస ప్రాజెక్ట్ ల నేపథ్యంలో సుహాస్ రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుహాస్ క్రేజ్ ఉన్న దర్శకుల దర్శకత్వంలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. సుహాస్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో సుహాస్ ఈ స్థాయికి ఎదిగారు.

సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు కూడా దూరంగా ఉండాలని కొంతమంది చెబుతున్నారు. సుహాస్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సుహాస్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టగా షార్ట్ ఫిల్మ్స్ తో పాటు పలు ఇంటర్వ్యూల ద్వారా గుర్తింపు దక్కింది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే సుహాస్ పారితోషికం మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus