Hero Suriya: ఆమె కోసం పదిలక్షలు డిపాజిట్ చేసిన స్టార్ హీరో!

తమిళ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్ గా ఆయన నటించిన ‘జై భీమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. అన్యాయంగా జైల్లో పెట్టిన తన భర్తను కాపాడుకోవడానికి ఓ గిరిజన మహిళ చేసే ప్రయత్నం.. దానికి ఓ లాయర్ సాయపడే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.

రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చంద్రు అనే లాయర్ పాత్రలో సూర్య నటించారు. సూర్య పాత్రతో పాటు సినిమాలో సినతల్లి అనే ట్రైబల్ లేడీ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. సినతల్లి పాత్రకి నిజ జీవితంలో పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్ఫూర్తి. ఈ సినిమాతో రియల్ లైఫ్ క్యారెక్టర్లు కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి. ప్రస్తుతం పార్వతి అమ్మాళ్ కష్టాల్లో ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా పిల్లలను పోషించలేక, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న కొరియోగ్రఫర్‌ రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సూర్య సైతం పార్వతి అమ్మాళ్‌కు సపోర్ట్ చేస్తూ.. ఆమె కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేశారు. ఈ డబ్బుపై వచ్చే వడ్డీ ప్రతి నెలా పార్వతి అమ్మాళ్ కు చేరేలా చేశారు. ఆమె తదనంతరం ఆమె పిల్లలకు ఈ వడ్డీ అందజేస్తామని సూర్య తెలిపారు. సూర్య చేసిన ఈ పనికి ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus