కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడది 5 రెట్లు పడిపోయిందనే చెప్పాలి. ఒకప్పుడు రూ.15 కోట్లు పలికేవి సూర్య సినిమాల బిజినెస్ డీటెయిల్స్. కానీ ఇప్పుడు అది రూ.3 కోట్లు, రూ.4 కోట్ల వరకే పలుకుతుంది. తాజాగా విడుదలైన ‘ఈటి’ ఎవ్వరికీ తలవంచడు చిత్రం రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. అది కూడా ‘పెద్దన్న’ కి వచ్చిన నష్టాలకి గాను ఈ చిత్రాన్ని నష్టపరిహారంగా ఇచ్చారు ‘సన్ పిక్చర్స్’ వాళ్ళు.
అందుకే ఆ మాత్రం బిజినెస్ అయినా జరిగింది. లేదంటే రూ.3 కోట్లకి తక్కువగానే జరిగేదేమో. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే మొదటి రోజు ‘ఈటి’ కి సోలో రిలీజ్ దొరికినట్టే. ఇదే ఛాన్స్ అని మొత్తం ఒకేరోజు రికవరీ అయిపోతుందని తెలుగు బయ్యర్స్ అంచనా వేశారు. ఎందుకంటే సూర్య గత చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అవి ఓటిటిలో విడుదలైన సినిమాలు అయినప్పటికీ ‘ఈటి’ పై ప్రేక్షకులు నమ్మకంతో వస్తారనుకున్నారంతా..!
దర్శకుడు పాండిరాజ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తుంటాయి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఓపెనింగ్స్ ఓ మాదిరిగానే నమోదయ్యాయి. ‘ఎన్జీకే’ ‘బందోబస్త్’ వంటి చిత్రాలు రూ.1కోటి పైనే షేర్ ను నమోదు చేసాయి. కానీ ‘ఈటి’ రూ.0.80 కోట్ల షేర్ ను మాత్రమే నమోదుచేసింది. రెండో రోజున రాధే శ్యామ్ ఎంట్రీతో థియేటర్స్ కౌంట్ బాగా తగ్గిపోయింది. ఈ వీకెండ్ కు రూ.3.2 కోట్లు షేర్ ను రాబట్టడం కష్టమే.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అది సాధ్యం కాదనే చెప్పాలి..!ఇక సూర్య కూడా రూటు మార్చాలి. ధనుష్, శివ కార్తికేయన్ లలా అతను కూడా తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదంటే కష్టమే..!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!