’చియాన్’ విక్రమ్.. ఈయనకి సినిమా అంటే ఎంత ప్యాషనో, క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడతాడో.. పోషించే పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యడానికి, తన అద్భుతమైన నటనతో ఆ పాత్రకి ప్రాణం పొయ్యడానికి ఐదు పదుల వయసు దాటినా మొండిగా ఎలా దూసుకెళ్తాడో కొత్తగా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అంతకుముందు తెలుగులో డైరెక్ట్ గా ‘9 నెలలు’ అనే సినిమా చేసినా.. ‘శివపుత్రుడు’ తోనే ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ‘అపరిచితుడు’ నుండి ఇక్కడి వాళ్ల మనసులు దోచుకున్నాడు..
ఈ ఏడాది ’కోబ్రా’ తో కాస్త నిరాశ పరచినా.. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. ఇప్పుడు తన 61వ సినిమాని సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘కబాలి’, ‘కాలా’ సినిమాలను తెరకెక్కించిన ప్యాషనేట్ ఫిలిం మేకర్ పా. రంజిత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని కడపలో షూటింగ్ స్టార్ట్ చేశారు మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు కథానాయికలు..
టాలెంటెడ్ యాక్టర్ పశుపతి కీలకపాత్రలో నటిస్తున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు.. స్వాతంత్య్రానికి ముందు 19వ శతాబ్దంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తున్న విక్రమ్ కొత్త మూవీకి ‘తంగలాన్’ అనే పేరు ఫిక్స్ చేశారు. చియాన్ ఆదివాసీయుడి పాత్రలో, కండలు తిరిగిన దేహంతో, సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్నాడు. తమిళ్, హిందీ భాషల్లో షూటింగ్ జరిపి.. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చెయ్యనున్నారు.
స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద తమిళ స్టార్ సూర్య కజిన్ కె.ఇ.జ్ణానవేల్ రాజా, నీలం ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్న ‘తంగలాన్’ కి ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు, నటుడు, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. విక్రమ్ కెరీర్ లో ప్రెస్టీజియస్ గా రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది.. ఈ సినిమా తమిళనాట సరికొత్త సంచలనాలకు తెరతీస్తుందని, విక్రమ్ లాంటి టాలెంటెడ్ నటుడి గురించి ప్రపంచమంతా మాట్లాడుతుందని ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు..