Vikram Remuneration: విక్రమ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

కోలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన విక్రమ్ నటించిన కోబ్రా సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో ఆమె అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని విక్రమ్ కు ఈ సినిమా కూడా భారీ షాకిచ్చింది.

అయితే ఈ సినిమా కోసం విక్రమ్ ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా నిరాశపరచడంతో విక్రమ్ సరైన కథలను ఎంచుకోవడంపై దృష్టి పెట్టాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ కాలేదు. కోబ్రా సినిమాలో విక్రమ్ నటనకు వంకలు పెట్టలేమని అయితే కథల విషయంలో చేస్తున్న పొరపాట్ల వల్ల విక్రమ్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అపరిచితుడు సినిమాకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

అపరిచితుడు సినిమా తర్వాత విక్రమ్ నటించిన సినిమాలేవీ ఆయన రేంజ్ హిట్లుగా నిలవలేదు. విక్రమ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు విక్రమ్ క్రేజ్ పెరుగుతుండగా కెరీర్ విషయంలో విక్రమ్ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే విక్రమ్ కెరీర్ కు మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus