కావాలంటే నేను కమెడియన్ గా నటిస్తా!

ఒక్కోసారి సినిమా రిలీజ్ అయ్యేవరకూ హీరోయిన్ కే కాదు హీరో చేసిన సీన్స్ ఎన్ని మిగిలాయో అనే విషయం మీద కూదా క్లారిటీ ఉండదు. రీసెంట్ గా “కేరాఫ్ సూర్య” సినిమా విషయంలో అదే జరిగింది. కథ గమనానికి అడ్డుగా ఉందని సినిమాలో మెహరీన్ సన్నివేశాలన్నీ కత్తిరించి పడేశారు. అదే విధంగా ఇప్పుడు విక్రమ్ తాజా తమిళ చిత్రం “స్కెచ్” సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ సూరీ నటించిన సన్నివేశాలన్నీ తీసేశారట. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న సూరీ సీన్స్ అన్నీ స్క్రీన్ ప్లే క్రిస్పీగా ఉండడం కోసం కత్తిరించేశామని “స్కెచ్” దర్శకుడు చెప్పాడు.

అయితే.. అదే స్టేజ్ మీద ఉన్న విక్రమ్ మైక్ అందుకొని సూరీకి సభలో సారీ చెప్పడమే కాక.. భవిష్యత్ లో సూరీ గనుక హీరోగా సినిమా చేస్తే.. ఆ సినిమాలో తాను కమెడియన్ గా నటిస్తానని, ఇదే సూరీకి నేను చేస్తున్న ప్రామిస్ అని మీడియా సాక్షిగా ప్రామిస్ చేయడం విశేషం. సూరి భవిష్యత్ లో హీరోగా నటిస్తాడా, విక్రమ్ ఆ సినిమాలో కమెడియన్ గా నటిస్తాడా లేదా అనే విషయాలు పక్కన పెట్టేస్తే.. విక్రమ్ లాంటి ఒక స్టార్ హీరో ఈ విధంగా పబ్లిక్ గా సారీ చెప్పడమే కాక కమెడియన్ గానూ నటిస్తానని చెప్పడం అందరి హృదయాలని తాకింది.

ఇకపోతే.. సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదలైన “స్కెచ్”కి మిశ్రమ స్పందన లభించింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 26న విడుదల చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus